ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చేనేత సహకార సంఘం లిమిటెడ్ (ఆప్కో) నెలవారీ పొదుపు చేసుకొని వివిధ రకాలైన చేనేత వస్త్రాలను 30 శాతం రాయితీతో వినియోగదారులు కొనుగోలు చేసుకొనేలా ప్రత్యేక ఫధకం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చేనేత సహకార సంఘం లిమిటెడ్ (ఆప్కో) నెలవారీ పొదుపు చేసుకొని వివిధ రకాలైన చేనేత వస్త్రాలను 30 శాతం రాయితీతో వినియోగదారులు కొనుగోలు చేసుకొనేలా ప్రత్యేక పధకాన్ని ప్రవేశ పెట్టినట్లు జిల్లా చేనేత మరియు విశాఖ సహాయ సంచాలకులు బి.ఉదయ కుమార్ తెలిపారు. ఈ పధకంలో వినియోగదారులు 11 నెలలపాటు వాయిదాలు చెల్లిస్తే 12వ నెల వాయిదాను ఆప్కో ఉచితంగా చెల్లిస్తుందని వివరించారు. నెలవారీ కనీస వాయిదా మొత్తం రూ.500/- నుంచి మొదలవుతుందని చెప్పారు. ఉదాహరణకు వినియోగదారులు ఒక నెలకు వెయ్యి రూపాయలు చొప్పున 11 నెలల కాలానికి రూ.11,000/-లు చెల్లిస్తే 12వ నెల వాయిదా వెయ్యి రూపాయలను ఆప్కో ఉచితంగా చెల్లిస్తుందని అన్నారు. ఈ విధంగా 12 నెలల వాయిదాల మొత్తం రూ.12,000/- లు అవుతుందని తెలిపారు. ఇలా 12 నెలల వాయిదాలు పూర్తి అయిన తరువాత వినియోగదారులు రూ.17,100/-లు విలువగల కాటన్ చీరలు, సిల్క్ చీరలు, ధోతీలు, లుంగీలు, దుప్పట్లు, టవల్స్, షర్టింగ్, డ్రసెమెటీరియల్స్ తదితర చేనేత వస్త్రాలను కొనుగోలు చేయవచ్చని చెప్పారు. మొత్తం 12 నెలల వాయిదాలు సకాలంలో పూర్తి చేసిన వారికి మాత్రమే ఈ 30 శాతం రాయితీ వర్తిస్తుందని అన్నారు. ఈ సదవకాశాన్ని ఉద్యోగస్తులు, జిల్లా ప్రజలు అందరూ ఉపయోగించుకోవాలని ఆయన కోరారు. మరిన్ని వివరాలకు ఒంగోలు ఆప్కో షోరూము మేనేజర్ వి. సురేంద్ర ( సెల్ నెంబర్ : 9985123250) ను సంప్రదించాలని సహాయ సంచాలకులు సూచించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *