పర్యాటక ప్రాంతాల పట్ల అవగాహన కలిగి ఆస్వాదించాలి – ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా పలు పోటీలు నిర్వహణ

విద్యార్థులు జిల్లాలో పర్యాటక ప్రాంతాల పట్ల అవగాహన కలిగి ప్రకృతి అందాలను ఆస్వాదించి పర్యాటక రంగాన్ని ప్రోత్సహించాలని జిల్లా ఉపాధి కల్పన అధికారి టి. భరద్వాజ్ అన్నారు. స్థానిక హర్షిణి డిగ్రీ కళాశాలలో ఈనెల 27న ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా పలు పోటీలను నిర్వహించారు. అనంతరం విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. జిల్లా టూరిజం అధికారి బెనహర్ మాట్లాడుతూ జిల్లాలో పలు ప్రసిద్ధి చెందిన టూరిజం క్షేంద్రాలు ఉన్నాయని,కుటుంబసభ్యులు, మిత్రులతో కలసి సందర్శించాలని కోరారు. జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి ఆర్ లోకనాథం మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు నైపుణ్యంలో కూడ కలిగి ఉంటే జీవితంలో స్థిర పడవచ్చని అన్నారు. ప్రతి ఒక్క విషయాన్ని పరిశీలించి అందులో ఉన్న నైపుణ్యాన్ని పరిశీలించాలని కోరారు. నెహ్రూ యువకేంద్ర జిల్లా అధికారి కమలషా, కళాశాల ప్రిన్సిపాల్ డి ఆంజనేయులు టూరిజం వలన కలిగే ఉపయోగాలపై అవగాహన కల్పించారు. పలు పోటీలను నిర్వహించారు. విజేతలకు ఈనెల 27న జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా బహుమతులు అందిస్తామని చెప్పారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *