కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతో దేశంలోని దళితవాడలన్నీ అభివృద్ధి చెందుతున్నాయని, కొత్తగా ప్రవేశపెట్టిన విశ్వకర్మ యోజన తో దళితవాడలో నివసిస్తున్న చేతివృత్తుల ప్రజలందరూ మరింత అభివృద్ధి చెందేవిధముగా లక్ష నుండు మూడు లక్షల వరకు ఋణాలు ఇవ్వడం జరుగుతుందని, ఆ పథకంను అందరూ వినియోగించుకోవాలని శివారెడ్డి కోరారు.
సీనియర్ నాయకులు నన్నే పోగు సుబ్బారావు ఆధ్వర్యంలో స్థానిక బలరాం కాలని ప్రాంత దళితవాడలలో అక్కడి ప్రజలకు కేంద్ర ప్రభుత్వ పథకాలు తెలిపే విధముగా ఏర్పాటు చేసిన దళితవాడ సందర్శన కార్యక్రమములో ముఖ్యఅతిథిగా భాజపా జిల్లా అధ్యక్షులు పివి శివారెడ్డి పాల్గొన్నారు. దళితవాడలో ఉన్న సమస్యలను, అక్కడ నివసిస్తున్న ప్రజల జీవన విధానం పై ఆరాతీశారు. నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన పథకాలను వివరించారు.
ఈ కార్యక్రమంలో పార్లమెంట్ కన్వీనర్ సెగ్గం శ్రీనివాసరావు, ఉపాధ్యక్షురాలు జాజ్జర కృష్ణవేణి, విశ్వకర్మ కన్వీనర్ ఎనుముల నాగేశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి శివాజీ యాదవ్, యువ మోర్చ నాయకులు దామోదర్, అనిల్, కీర్తి, తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

