విగ్నేశ్వరుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని దర్శి ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ ఆకాంక్షించారు. వినాయక చవితి పండుగ సందర్భంగా మండలంలోని పసుపు గళ్ళు గ్రామంలో వైసీపీ మండల కన్వీనర్ బిజ్జం వెంకట సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన విఘ్నేశ్వరుని నీ బుధవారం పది రోజులు పాటు పూజలందుకొని తరలించేందుకు ఏర్పాటు చేశారు. ఈ నిమజ్జన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా దర్శి ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ హాజరైనారు. ఎమ్మెల్యేకు స్థానిక వైసిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, భక్తులు ఘన స్వాగతం పలికారు. విఘ్నేశ్వరుడినిదర్శించుకుని ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్యే ప్రజలకు అభివాదం తెలిపారు. ఎమ్మెల్యే రాకతో వైసీపీ శ్రేణుల్లో ఆనందోత్సవాలు వెళ్లి విరిసాయి. యువకులు కేరింతల కొడుతూ బాణాసంచా కాల్చుతూ డప్పు వాయిద్యాల మధ్య మేళా తాళాల మధ్య డీజే స్పీకర్ల సౌండ్ మధ్య డాన్సులు వేస్తూ సందడి చేశారు. ఈ కార్యక్రమంలో చింతా వెంకట శ్రీనివాసరెడ్డి, మహిళలు పాల్గొన్నారు.

