పర్యాటక ప్రాంతాల ప్రాముఖ్యతను గుర్తించాలి – విజేతలకు బహుమతులు అందజేత – జిల్లా రెవిన్యూ అధికారి శ్రీలత

విద్యార్థులు పర్యాటక ప్రాంతాల ప్రాముఖ్యతను తెలుసుకుని భావి తరాలకు కూడ వివరించాలని జిల్లా రెవిన్యూ అధికారి శ్రీలత అన్నారు. స్థానిక హర్షిణి డిగ్రీ కళాశాలలో బుధవారం ప్రపంచ పర్యాటన దినోత్సవంను ఘనంగా నిర్వహించారు. జిల్లా పర్యాటక అధికారి బెన్ హర్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా రెవిన్యూ అధికారి శ్రీలత మాట్లాడుతూ …. ప్రపంచ పర్యాటన దినోత్సం ప్రాముఖ్యతను తెలియజేస్తూ విద్యార్థులకు జిల్లా పర్యాటన శాఖా ఆధ్వర్యంలో పలు పోటీలు నిర్వహించటం అభినందనీయమని అన్నారు. ప్రకృతి పర్యావరణ ప్రేమికులకు పర్యాటక ప్రాంతాలు ఒక వరమని అన్నారు. స్లైప్ మెనేజర్ ఆర్పీ శ్రీమన్నారాయణ, స్కిల్ డవలప్ మెంటు అధికారి ఆర్ లోకనాథం, నెహ్రూ యవకేంద్ర అధికారి కమల్ షా, హర్షిణి కళాశాల ప్రిన్సిపాల్ ఆంజనేయులు, ఆర్కిడ్ స్కూల్ కరస్పాండెంట్ అజయ్ కుమార్ పాల్గొన్నారు. ప్రపంచ పర్యాటన దినోత్సవంను పురష్కరించుకుని విద్యార్థులకు నిర్వహించిన పలు పోటీలలో విజేతలైన విద్యార్థులకు ప్రశంశా పత్రాలు అందించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *