భారత ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోడీ పిలుపు మేరకు, రాష్ట్ర బిజెపి అధ్యక్షురాలు పురందరేశ్వరి సూచన మేరకు స్వచ్ఛభారత్ ఉద్యమంలో భాగంగా ఆదివారం భారతీయ యువ మోర్చా ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఒంగోలు పురవీధులను శుభ్రం చేశారు. ఈ కార్యక్రమానికి పార్టీ జిల్లా అధ్యక్షులు పి వి శివారెడ్డి ముందుండి స్వచ్ఛ నిర్వహింపచేశారు.స్థానిక కలెక్టరేట్, అంబేద్కర్ భవన్, దేవుని చెరువు పార్క్, శర్మ కాలేజ్ తదితర ప్రాంతాల్లో చీపురు పట్టి శుభ్రం చేశారు. ఈ సందర్భంగా పివి శివారెడ్డి మాట్లాడుతూ గాంధీజీ కలలు కన్నా స్వచ్ఛ భారత్ కై మనందరం కృషి చేసినప్పుడే వారికి ఘనమైన నివాళిగా అర్పించినట్లు అవుతుందని, ఎప్పుడైతే పరిసరాలు పరిశుభ్రంగా ఉంటాయో ఆరోగ్యం, ఐశ్వర్యం లభిస్తాయన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం చెత్త సేకరణ పై పన్నువేసి నెలవారి ప్రతి ఇంటి వద్ద, ప్రతి ఒక్కరి దగ్గర నుండి రుసుము వసూలు చేస్తుందని, అయినప్పటికీ వీధులన్నీ అపరిశుభ్రంగానే ఉంటున్నాయని, ఇలాంటి పరిస్థితులు ఈ వర్షాకాలంలో కొనసాగితే దోమలు పెరిగి పలు వ్యాధుల బారిన పడి ప్రజలు ఇబ్బందులు పడే పరిస్థితి ఉందని, ఇప్పటికే వైద్యశాలలో జ్వరాలతో ప్రజలు చేరుతున్నారని, ఇవన్నీ గుర్తించి కార్పొరేషన్ అధికారులు స్వచ్ఛ ఒంగోలు సాధనకు కృషి చేస్తూ ప్రజలను భాగస్వాములను చేసే విధంగా కార్యక్రమాలు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో రవిశంకర్, రావులపల్లి నాగేంద్ర యాదవ్, బొమ్మసాని పద్మావతి, కంభంపాటి ఆంజనేయులు, బసనేపల్లి రాజశేఖర్, సింగోతు రాజేష్ వర్మ, గుర్రం సత్యనారాయణ, జువ్విగుంట కోటేశ్వరి, పీవీ కృష్ణారెడ్డి, పిన్నింటి తిరుమలరావు, అమరసింహం, శివాజి యాదవ్, కళ్లం సుబ్బారెడ్డి, గుర్రం కృష్ణ తదితర పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.


