ప్రకాశం జిల్లా దర్శి మండలం రామచంద్రాపురం ఎస్సీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవం గ్రామ సర్పంచ్ కే పెద్ద వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగింది. తాసిల్దార్ కార్యాలయం సీనియర్ అసిస్టెంట్ నరసింహారావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న నవరత్నాలు సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరూ ఉపయోగించు కొని ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చెందాలని ఆయన అన్నారు.గ్రామంలో సమస్యలు మా దృష్టికి తీసుకుని వచ్చి పరిష్కరించుకోవాలని ఆయన కోరారు ఈ సందర్భంగా రాష్ట్ర దళితసేన దర్శి నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి గణపురం ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ గ్రామంలో ఎస్సీ కాలనీకు మంచినీళ్లు లేక నీకు ఇబ్బందులు పడుతున్నారని, దీనిపై సంబంధిత అధికారికి సమస్యను చెప్పుకోవాలి అంటే అధికారులు డుమ్ము కొడుతున్నారని డిపార్ట్మెంట్ సంబంధించినJE రావటం లేదని, దళితవాడలో సైడ్ కాలువ వ్యవస్థ లేక మురికి అక్కడి నిలువండి సమీప అంగన్వాడి స్కూల్ కి వెళ్లే దారిలోదోమలు ఉత్పత్తి కేంద్రంగా తయారై ……చిన్న పిల్లలు ఇబ్బంది పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు . పౌర హక్కుల దినోత్సవం కార్యక్రమానికి ప్రభుత్వం ప్రతిష్టంగా తీసుకున్న దళితుల సమస్య పరిష్కారానికై ముఖ్యమైన మండల అధికారులు మొక్కుబడి కార్యక్రమం పెట్టి దళితుల సమస్యలపై చోరువ చూపక పోవడంబాధాకరం. ఈ సమస్యపై జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ బీసీ, మైనార్టీ వేదిక నియోజకవర్గ నాయకులు రాచపూడి మోషే, కరెంట్ రూరల్ జేఈ వేణుగోపాల్, వీఆర్వో, నాసరయ్య, హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసరావు సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

