దర్శి పట్టణంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో గాంధీ జయంతి సందర్భంగా మహాత్మాగాంధీకి ఘన నివాళులు అర్పించారు. దర్శి పట్టణంలోని నగర పంచాయితీ కార్యాలయం వద్ద ఉన్న మహాత్మాగాంధీ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బిజెపి దర్శి అసెంబ్లీ కన్వినర్ మాడపాకుల శ్రీనివాసులు మాట్లాడుతూ జాతిపిత అడుగు జాడలతో నేటి యువత పయనించాలని ఆయన కన్న కలలను నిజం చేయ్యాలని అన్నారు. జిల్లా ఉపాధ్యక్షుడు తిండి నారాయణ రెడ్డి, పట్టణ ఇన్చార్జి కనితి నాగభూషణాచారి, పట్టణ అధ్యక్షుడు గురువర్ధన రావు, ఏవీ నారాయణ రెడ్డి, బచ్చు అనిల్, చెక్కు రంగారావు, మోహనరావు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
