తాళ్లూరు మండలంలో ఘనంగా గాంధిజీ జయంతి వేడుకలు – పలు చోట్ల నివాళులు అర్పించిన ఎంపీపీ తాటికొండ, జెడ్పీటీసీ మారం – పలు పంచాయిలలో మొక్కలు నాటిన ప్రజా ప్రతినిథులు

తాళ్లూరు మండలంలో అన్ని పంచాయితీలలో గాంధీ జయంతి వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. తాళ్లూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో, తాళ్లూరులో గాంధీ విగ్రహం వద్ద ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు, జెడ్పీటీసీ మారం వెంకటరెడ్డి, వైస్ ఎంపీపీలు రమా వెంకటేశ్వరరెడ్డి, ఎం. ప్రియాక నాగార్జున రెడ్డి, తాళ్లూరు, రాజానగరం సర్పంచిలు మేకల చార్లెస్ సర్జన్. వలి, కో ఆప్షన్ మెంబర్ కరీముల్లా, ఎంఓఈ సుబ్బయ్య, ఎస్ఏ వజ్జా శ్రీనివాసరావు, ఎపీఎం దేవరాజ్, కొర్రపాటి వారి పాలెం జెసీఎస్ కన్వినర్ విష్ణు కార్యాలయ సిబ్బంది పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. మహాత్ముడు అందరికీ ఆదర్శనీయుడని ఆశయ సిద్ధాంతాలను ప్రపంచదేశాలు సైతం కౌనియాడారని, నేటి యువత ఆయన సిద్దాంతాలను పాటిస్తే సమాజం ఎంతో ఉన్నత స్థానంలో ఉంటుందని వక్తలు అన్నారు. బెల్లంకొండ వారిపాలెంలో సర్పంచి పోశం సుమలత శ్రీకాంత్ రెడ్డి, ఎంపీటీసీ గూడ సరస్వతి ప్రభాకర్ రెడ్డి, గ్రామ కార్యదర్శి, సిబ్బంది మహాత్ముని చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు ఆర్పించారు. పలు పంచాయితీలలో మహాత్ముని సేవలు గుర్తు చేసుకుని ఆయా గ్రామాల సర్పంచ్ అధ్యక్షతన గ్రామ సభలు నిర్వహించారు. తాళ్లూరులో ఎబీసీ ఉన్నత పాఠశాల విద్యార్థులు ర్యాలీగా వచ్చి మహాత్మాగాంధీ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. జాతిపిత జీవిత చరిత్రను విద్యార్థులకు ప్రధానోపాధ్యాయుడు వెంకటేశ్వరరావు వివరించారు. కరస్పాండెంట్ టి. శ్రీనివాస రెడ్డి, డైరెక్టర్ కాలేషాబాబు, ఎస్పీలు యలమందరావు, సుబ్బయ్య, కొండల రావు, వెంకటరావు, స్వరూపరాణి ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

మొక్కలను నాటిన ప్రజా ప్రతినిధులు, అధికారులు ..
తాళ్లూరు మండలం లో పలు పంచాయితీలలో , కస్తూర్బా పాఠశాలలో గాంధీ జయంతిని పురష్కరించుకుని మొక్కలు నాటారు. తాళ్లూరులో డీఆర్డీఏ పీడీ తేళ్ల రవిబాబు ఆధ్వర్యంలో ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు, జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డి, వైఎస్ ఎంపీపీ ఐ. వెంకటేశ్వర రెడ్డి, సర్పంచి మేకల చార్లెస్ సర్జన్ ముఖ్య అతిథులుగా పాల్గొని మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ పచ్చదనాన్ని పెంచి పర్యావరణాన్ని పరిరక్షించాలని వక్తలు అన్నారు. ఎంపీడీఓ కార్యాలయ పర్యవేక్షకులు వజ్జా శ్రీనివాసరావు, ఎపీఎం దేవరాజ్, కస్తూరిబా ప్రిన్సిపాల్ సుజిత ,కొర్రపాటి వారి పాలెం జెసీఎస్ కన్వినర్ విష్ణు, వైకెపి సిబ్బంది పాల్గొన్నారు.
బెల్లంకొండ వారి పాలెంలో సర్పంచి పోశం సుమలత శ్రీకాంత్ రెడ్డి, ఎంపీటీసీ గూడ సరస్వతి ప్రభాకర్ రెడ్డి, గ్రామకార్యదర్శి, సిబ్బంది పాల్గొని మొక్కలు నాటారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *