మహాత్ముడు అందరికీ ఆదర్శనీయుడని ఆశయ సిద్ధాంతాలను ప్రపంచదేశాలు సైతం కొనియాడారని, నేటి యువత ఆయన సిద్దాంతాలను పాటిస్తే సమాజం ఎంతో ఉన్నత స్థానంలో ఉంటుందని ఎబీసీ హైస్కూల్ ప్రిన్సిపాల్ కె వెంకటేశ్వరరావు అన్నారు. తాళ్లూరులో సోమవారం గాంధీజి జయంతిని పురష్కరించికొని బాపూజీకి ఘన నివాళి అర్పించారు. ఎబీసీ హైస్కూల్ వద్ద నుండి పలు దేశభక్తి స్లోగేన్స్ ఇస్తూ ర్యాలీగా వెళ్లి మహాత్మాగాంధీ విగ్రహంకు పూల మాలలు వేసి ఘన నివాళి అర్పించారు. అనంతరం ఎబీసీ హైస్కూల్ విద్యార్థులకు సభను నిర్వహించి నాడు అహింసా వాదంతో దేశానికి స్వాతంత్య్రం తీసుకువచ్చారని ఎంతో ఓర్పు, నేర్పు సహనంతో కూడిన గాంధీజీ జీవిత చరిత్ర నేటి కాలంలో విద్యార్థులకు ఆదర్శమని వక్తలు అన్నారు. అనంతరం బాపూజి చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. కరస్పాండెంట్ టి. శ్రీనివాస రెడ్డి, ప్రిన్సిపాల్ కె. వెంకటేశ్వరరావు, డైరెక్టర్ కాలేషాబాబు, ఎస్ఏలు యలమందరావు, చిన్నయ్య, కొండలరావు, సుబ్బయ్య, వెంకటరావు, స్వరూపరాణి, ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.









