నాణ్యమైన ఉచిత వైద్యం అందించటమే లక్ష్యంగా జగనన్న సురక్ష – మల్కాపురంలో జగనన్న ఆరోగ్య సురక్ష నిర్వహణ – ముఖ్య అతిథిలుగా పాల్గొన్న ఎంపీపీ తాటికొండ, జెడ్పీటీసీ మారం

నాణ్యమైన ఉచిత వైద్యం అందింటమే లక్ష్యంగా జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహిసున్నట్లు ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు, జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డి అన్నారు. మల్కాపురంలో మంగళవారం జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించారు. ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు, జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డి, వైస్ ఎంపీపీ ఐ. వెంకటేశ్వర రెడ్డి, గ్రామ సర్పంచి వలి, ఎంపీటీసీ వెంకటరామి రెడ్డి, ఎంపీడీఓ కెవై కీర్తి ముఖ్య అతిథులుగా పాల్గొని వైద్యశిబిరాన్ని ప్రారంభించారు. వైద్యాధికారి షేక్ ఖాదర్ మస్తాన్ బి ఆధ్వర్యంలో వైద్యపరీక్షలు నిర్వహించారు. వైద్యులు రాజేష్, స్పేషలిస్ట్ వైదులు గైనకాలజిస్ట్ పావని, లీనా, తూర్పు గంగవరం వైద్యురాలు మౌనికలు పాల్గొని పరీక్షించారు. కో ఆప్షన్ మెంబర్ కరిముల్లా, సొసైటీ చైర్మన్ యాడిక యలమందా రెడ్డి, వైసీపీ మండల పార్టీ అధ్యక్షుడు టీవీ సుబ్బా రెడ్డి, జెసిఎస్ కన్వినర్ యాడిక శ్రీనివాస రెడ్డి, సర్పంచిలు పీఎస్ శ్రీకాంత్ రెడ్డి, ఎంఈఓ జి సుబ్బయ్య, మాజీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు పూనూరి దేవదానం తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *