శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్ యూనివర్సిటీ బయో ఇన్ఫర్మేటిక్స్ విభాగాధిపతి ప్రొఫెసర్ అమినేని ఉమామహేశ్వరి

భారత ప్రభుత్వ ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ కార్యాలయం, న్యూఢిల్లీ మరియు రాయల్ సొసైటీ ఆఫ్ కెమిస్ట్రీ ద్వారా ఏర్పాటు చేసిన జ్యూరీ కెమిస్ట్రీ విభాగంలో అగ్రశ్రేణి 75 మంది భారతీయ మహిళల్లో ఒకరిగా ప్రొ. అమినేని ఉమామహేశ్వరిని ఎంపిక చేసి ఆమె విజయాలను షీ ఈజ్ సిరీస్ షీ ఈజ్ 75 ఉమెన్ ఇన్ కెమిస్ట్రీ యొక్క నాల్గవ ఎడిషన్లో చేర్చనున్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

భారతదేశ 75 ఏళ్ల స్వాతంత్య్రాన్ని పురస్కరించుకొని స్టీమ్ (సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, ఆర్ట్స్ – మ్యాథమెటిక్స్ రంగాలు: ) లో మహిళా నాయకత్వం, సుస్థిర అభివృద్ధిని జరుపుకునేలా 75 మంది మహిళల విజయపధ ప్రయాణ ఘట్టాలను ఈ పుస్తకం వివరిస్తుంది. దైర్యం, ఆశ, సంకల్పం వంటి వాటి గురించిన వ్యక్తిగత కథలను వివరిస్తుంది. ఈ పుస్తకం, అంత సులభం కాని మహిళల వ్యక్తిగత, వృత్తిపరమైన పోరాటాల గురించి _మాట్లాడుతుంది, అయితే ఈ విభాగాలలో ఏదో ఒకదానిలో పని చేయాలనుకునే ప్రతి అమ్మాయికి ఖచ్చితంగా స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. భారత ప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సలహాదారు, బ్రిటిష్ హైకమిషన్ ఆఫ్ ఇండియా మద్దతుతో కూడిన ఈ పుస్తకం లిఖిత పూర్వకముగా విడుదల చేయబడుతుంది.

ఈ పురస్కారాన్ని అందుకున్నందుకు స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డా.ఆర్.వి.కుమార్ గారు, బయోఇన్ ఫర్ మాటిక్స్ ప్రొ. అమినేని ఉమమహేశ్వరిని అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *