” విద్యాశాఖ నిర్వాకం అందరినీ నిర్ఘాంత పోయేలా చేస్తోంది. ఏకోపాధ్యాయ పాఠశా లల్లో పనిచేసే వారికి మరింత విషమ పరీక్షగా మారింది. ఫార్మేటివ్ అసెస్మెంట్ 2 పరీక్షలు మంగళవారం నుంచి ప్రారంభ మయ్యాయి. ఇవి మూడు రోజులపాటు కొనసాగుతాయి. ఉదయం, సాయంత్రం రెండు పూటలా పరీక్షలు నిర్వహించి పది రోజుల్లోపు ఆన్లైన్లో మార్కులను అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒకటి నుంచి పదో తరగతి వరకు విద్యార్థులకు సాగే ఈ పరీక్షల నిర్వహణ ఉన్నత పాఠశాలల్లో ఇబ్బంది లేదు. అక్కడ సబ్జెక్టు టీచర్లు అందుబాటులో ఉండటంతో సాఫీగా సాగిపో తాయి. అదే సమయంలో ప్రాథమిక పాఠశా లల్లో ఏకోపాధ్యాయులున్నచోట మాత్రం తలకు మించిన భారంగా మారింది.”
*పుణ్యకాలం సరి…* గతంలో ప్రశ్నపత్రాలు డీసీఈబీ ద్వారా ముద్రించి పాఠశాలలకు సరఫరా చేసేవారు. కొన్ని సంవత్సరాలు ఒక ప్రశ్నపత్రం పంపి వాటిని జిరాక్స్ తీయించుకోవాలని సూచించారు. తాజాగా పరీక్షలకు సంబందించిన ప్రశ్నపత్రాన్ని గంట ముందు వాట్సాప్ పంపుతున్నారు. ఉపాధ్యాయులు బోర్డుపై ప్రశ్నలు రాస్తే విద్యార్థులు వాటిని నమోదు చేసుకుని తర్వాత జవాబులు రాయాల్సి ఉంది. ఈ విధానం అటు ఉపాధ్యాయులు, ఇటు విద్యార్థులకు తీవ్ర ఇబ్బందికరంగా పరిణమించింది. అందు బాటులో ఉన్న చోట జిరాక్స్ తీయించి విద్యార్థులతో పరీక్షలు రాయిస్తే ఆ సదుపాయం లేని మారుమూల గ్రామాల్లో మాత్రం వెతలు తప్పడంలేదు. ఫోన్లో చూసి బోర్డుపై రాయటం, వాటిని పిల్లలు అనుసరించడంతో గంట పుణ్యకాలం కాస్తా పూర్తవుతోంది.
*పరీక్ష ఫీజులు వసూలు చేసి ఇదేమి పని అంటున్న ప్రైవేట్ యాజమాన్యాలు*
మరోవైపు డిసిఈబి ద్వారా పరీక్ష ఫీజులను వెలకు వేలు పరీక్ష తేదీలను వసూలు చేశారు గతంలో ప్రశ్నాపత్రాలను బండిల్స్ ద్వారా ఎంఆర్సిలకు పంపి పంపిణీ చేసేవాళ్ళు. ప్రస్తుతం వాట్సాప్ ల ద్వారా ప్రశ్నాపత్రాలను పంపడంతో వారు జిరాక్స్ కాపీలను తీసుకోవడానికి ఎంతో ఖర్చు అవుతున్నాయని వాపోతున్నారు.
*9 476 ఏకోపాధ్యాయ పాఠశాలలు* …
ఉమ్మడి ప్రకాశంలో 470 ఏకోపాధ్యాయ పాఠశాలలు కొనసాగుతున్నాయి. ఇరవై మందిలోపు పిల్లలున్న ప్రాథమిక పాఠశాలల్లో ఒక పోస్టు మాత్రమే కేటాయించారు. ఆ ఉపాధ్యాయుడు ఎప్పుడు సెలవు పెడితే మండలంలో స్టాండ్ బైగా ఉండే సీఆర్పే పర్యవేక్షించాలని సూచించాడు. కొన్ని ప్రాథమిక పాఠశాలల్లో అయిదు తరగతులు, 3, 4, 5 తర గతులు విలీనమైన చోట ఒకటి, రెండు తరగతులు కొనసా గుతున్నాయి. జిల్లాలోని ఉలిచ్చి మెయిన్, టంగుటూరు మండలం సంతరావూరు, కేసుపాలెం, నాగులుప్పలపాడు. మండలం చీర్యానుప్పులపాడు, దాసరివారిపాలెం, చీమవర్తి మండలం పాండురంగాపురం, సిద్దనగర్, మద్దిపాడు మండలం నందిపాడు, కొత్తపట్నం మండలం వలసపాలెం, -సంకవానికుంట, త్రిపురాంతకం మండలం గుట్లపల్లి, సుగా లితండా, పుల్లలచెరువు మండలం తాత చెరువుతండా, ఎర్ర పాలెం, దోర్నాల మండలం కటకానిపల్లి ఇలా వండల సంఖ్యలో ఏకోపాద్యాయ పాఠశాలలున్నాయి. అలాంటి చోట అయిదు తరగతులకు ఉదయం సాయంత్రం ఒకే ఉపాధ్యా యుడు పరీక్షలు నిర్వహించాల్సి వస్తోంది. ప్రభుత్వమే ప్రశ్న పత్రాలను పాఠశాలలకు పంపితే ఈ సమస్య ఉండదని ఉపాధ్యాయ సంఘాలు అభిప్రాయ పడుతున్నాయి.