ఉద్యానవనశాఖ లక్ష్యాలను చేరుకోవాలి రైతులకు ప్రభుత్వ సబ్సిడీలపై అవగాహన కల్పించాలి – నాణ్యతతో కూడిన ఉత్పత్తుల తయారీకి పోత్సాహం అందించాలి – జిల్లా ఉద్యాన వన శాఖాధికారి వై. గోపీ చంద్

ప్రభుత్వం రైతులకు ఉద్యాన వనశాఖ ద్వారా అందిస్తున్న సబ్సిడీలపై తెలియజేసి శాఖ లక్ష్యాలను చేరుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చెయ్యాలని జిల్లా ఉద్యాన వన శాఖాధికారి వై. గోపి చంద్ కోరారు. ఒంగోలు ఉద్యాన వన శాఖ కార్యాలయంలో శనివారం జిల్లాలోని క్లస్టర్ ఉద్యానవన శాఖాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో జిల్లా ఉద్యాన వన శాఖాధికారి మాట్లాడుతూ…. సమీకృత ఉద్యాన అభివృద్ధి మిషన్ (ఎంఐడీహెచ్) లో జిల్లాలో నిమ్మ, బత్తాయి, మామిడి, జామ, దానిమ్మ, డ్రాగెన్ ఫ్రూట్, కరోండో, నేరేడు పంటలను పొత్సాహం అందిస్తున్నట్లు చెప్పారు. అదే. విధంగా షెడ్ నెట్స్, ప్లాస్టిక్ మర్చింగ్, యాండీ బర్డ్స్ సెట్లకు ఇస్తున్న 40 శాతం రాయితీలను రైతులకు వివరించాలని చెప్పారు. పంట కోత తర్వాత మంచి యాజమాన్య పద్ధతులు అవలంభించి వినియోగదారునికి చేరే వరకు నాణ్యతగా ఉంచేందుకు ప్లాస్టిక్ హౌస్ ల ఏర్పాటు, పండ్లు మాగ పెట్టు గదులకు, నీటి కుంటలు ఏర్పాటుకు, మినీ ట్రాక్టర్స్, దైవాన్ స్పేయర్స్, పవర్ టిల్లర్స్ ఇస్తున్న పోత్సాహాలను తెలిపాలని కోరారు. రాష్ట్రీయ కృషి యోజన ద్వారా తీగ జాతి మొక్కల పెంపకానికి ఎకరానికి లక్ష వరకు మంజూరు చేసిన విధానాన్ని వివరించాలని చెప్పారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఉద్యాన వన శాఖలో రూ.1500 లక్షల రూపాయలకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసామని అందుకు అనుగుణంగా క్లస్టర్ ఉద్యాన వన శాఖాధికారులు రైతులను ప్రొత్సహించాలని సూచించారు. రైతులకు ఇస్తున్న సబ్సిడీ ప్రతి పైసా నేరుగా వారి ఖాతాలకే జమ అవుతుందని వివరించారు. కార్యక్రమంలో ఒంగోలు, గిద్దలూరు, కంభం, కలిగిరి, పామూరు, మార్కాపురం, గొండపాలెం, దర్శి క్లస్టర్ ఉద్యానశాఖ అధికారులు శ్రీలక్ష్మి, విష్ణుప్రియ, సాయి శ్వేత, అంజలి భాయ్, కుసుమ, రమేష్, ఆది రెడ్డి, రవి వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *