ప్రకాశం జిల్లాలో వర్షాధార ప్రాంత అభివృద్ధి పథకంలో 45 చిరుధాన్యాలు, పప్పు దినుసులు, వేరుశనగ విత్తనాల ప్రాసెసింగ్ యూనిట్లకు ఒక్కక్క యూనిటు రెండు లక్షల వరకు రాయితీతో ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా వ్యవసాయాధికారి ఎస్ శ్రీనివాసరావు తెలిపారు. జిల్లాలో ఈ యూనిట్స్ మర్రిపూడి, దొనకొండ, పొదిలి, కొనకల మిట్ల, పామూరు, చంద్రశేఖర పురం, హనుమంతుని పాడు, దోర్నాల, పెద్దార వీడు. కొమరోలు మండలాలలో ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఆయా యూనిట్స్ను రైతు ఉత్పత్తిదారుల సంఘం (ఎఫ్పీఓ)ల ద్వారా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. విత్తన ప్రాసెసింగ్ యూనిట్ కి కావలసిన యంత్ర పరికాల కోసం సంబంధిత మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ డీలర్ల నుండి సీల్డ్ కోటేషన్స్ కోరుతున్నట్లు చెప్పారు. పూర్తి వివరాలకు ప్రకాశం జిల్లా అధికారిక వెబ్ సైట్ ను సందర్శించాలని చెప్పారు. పూర్తి వివరాలకు జిల్లా వ్యవసాయాధికారి కార్యాలయంలో ఆర్ఎడి పథక నోడల్ అధికారి పివి రమేష్, ఫోన్ నంబర్ 8331057054ను సంప్రదించాలని కోరారు. కోటేషనన్లు పది రోజుల లోపుల జిల్లా వ్యవసాయాధికారికి సమర్పించాలని తెలిపారు.
విత్తన ప్రాసెసింగ్ యూనిట్ల యంత్ర పరికరాల సరఫరాకు టెండర్లు ఆహ్వానం
07
Oct