తెగుళ్ల పట్ల రైతులను అప్రమత్తం చెయ్యాలి – పలు తెగుళ్లు నివారణ చర్యలు సూచించిన ఆత్మ పీడి, జిల్లా వనరుల కేంద్రం సమన్వయ కర్త అన్నపూర్ణ

జిల్లాలో ప్రస్తుతం సాగులో ఉన్న పంటలో పలు తెగుళ్లు, పురుగులు ఆశిస్తున్న నేపథ్యంలో రైతులను
సస్యరక్షణపై అప్రమత్తం చెయ్యాలని ఆత్మ ప్రాజెక్టు డైరెక్టర్, జిల్లా వనరుల కేంద్రం సమన్వయ కర్త అన్నపూర్ణ సూచించారు. ఒంగోలు జిల్లా వనరుల కేంద్రం నుండి జిల్లాలోని సహాయ వ్యవసాయ సంచాలకులు, వ్యవసాయాధికారులు, విఏఏలు, సిబ్బంది, ఆర్టికేపరధిలో రైతులకు శనివారం వెబెక్స్ సమావేశం నిర్వహించారు. జిల్లాలో వరి, కంది, ప్రత్తి పంటలలో వివిధ దశలలో రైతులు పాటించాల్సిన జాగ్రత్తలు వాడాల్సిన ధాతు లోప మందులు, పిచికారి మందుల గురించి వివరించారు. డిఆర్సీ ఎవోలు శైలజా రాణి,వెంకట శేషమ్మలు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

అయా పంటల్లో తీసుకోవాల్సిన సస్యరక్షణ చర్యలు ఈ విధంగా ఉన్నాయి…
వరి పంట – నారుమడి దశ నుండి పిలక దశ వరకు ఉన్నది.
నారుమడిలో
జింకు ధాతు లోప నివారణకు 2 గ్రాములు జింకు సల్ఫేట్ లీటరు నీటికి కలిపి అవసరాన్ని బట్టి వారం వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి.
ఇనుప ధాతు లోప నివారణకు అన్నభేది 20 గ్రాములు మరియు నిమ్మ ఉప్పు 2 గ్రాములు ఒక లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
నారు పీకడానికి 7-10 రోజుల ముందు సెంటు నారుమడికి 160 గ్రాముల కార్బోప్యూరాన్ 3 జి గుళికలు వేయాలి.
నారు నాటే ముందు కొసలు త్రుంచి నాటాలి.
ప్రధాన పొలంలో
జింకు ధాతు లోప నివారణకు ఆఖరి దమ్ములో ఎకరాకు 20 కిలోల జింకు సల్ఫేట్ వేయాలి.
పైరుపై జింకు ధాతు లోప నివారణకు 2 గ్రాములు జింకు సల్ఫేట్ లీటరు నీటికి కలిపి అవసరాన్ని బట్టి వారం
వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి.
పురుగులు:
సుడి దోమ నివారణకు –

  • కాలిబాటలు తీయాలి. నత్రజని ఎరువులను తగిన మోతాదులో వేపపిండితో కలిపి వేసుకోవాలి.
  • బుప్రోఫెజిన్ 1.6 మి.లీ./ ఇతోఫెన్ ప్రాక్స్ 2 మి.లీ./ ఇమిడాక్లోప్రిడ్ + ఎథిప్రోల్ 80 డబ్ల్యు.జి. 0.25 గ్రాములు/ ప్రైమెట్రోజన 0.6 గ్రాములు/ డైనో టెఫ్యురాన్ 20 యస్.జి. 0.4 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
  • దోమ మందు పిచికారీ చేయు సమయంలో పొలంలో నీరు తీసి నాజిల్ ను దుబ్బు క్రింద వైపుకు త్రిప్పి మొదళ్ళపై పురుగు మందు పడే విధంగా పిచికారీ చేయాలి.
    ఆకు చుట్టు పురుగు నివారణకు
    పురుగు మందు పిచికారీ చేయడానికి ముందు చేనుకు అడ్డంగా తాడును లాగితే ఆకు ముడతలోని పురుగులు క్రింద
    పడిపోతాయి, అప్పుడు మందు పిచికారీ చేస్తే పురుగు మీద బాగా పనిచేస్తుంది.. క్లోరిపైరిఫాస్ 20 ఇ.సి. 2.5 మి.లీ./కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 2 గ్రాములు/ ఫిప్రోనిల్ 2 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ
    చేయాలి. ఉదృతి ఎక్కువగా ఉంటే ఫ్లూటెండమైడ్ 0.1 మి.లీ./ క్లోరంద్రనిలిప్రోల్ 0.3 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
    తొలుచు పురుగు నివారణకు – • లింగాకర్షక బుట్టలు ఎకరానికి 10 చొప్పున అమర్చాలి.
  • పురుగు ఉధృతి గత సంవత్సరం ఎక్కువగా ఆశించినట్లయితే చిరు పొట్ట దశకు ముందు గానే కార్బోప్యూరాన్ 3 జి గుళికలు 10 కిలోలు/ కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 4 జి గుళికలు 8 కిలోలు/ క్లోరంత్ర నిలిప్రోల్ 0.4 % గుళికలు 4 కిలోలు ఎకరానికి వాడాలి.
  • క్లోరిపైరిఫాస్ 20 ఇ.సి. 2.5 మి.లీ./కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 2 గ్రాములు/ క్లోరంత్ర నిల్లిప్రోల్ 0.3 మి.లీ./ప్లూటెండమైడ్ 0.1 మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఉల్లికోడు నివారణకు –
    కార్బోప్యూరాన్ 3 జి గుళికలు 10 కిలోలు/ క్లోరంత్ర నిల్లిప్రోల్ 0.4 % గుళికలు 4 కిలోలు ఎకరానికి వాడాలి. • ఫిప్రోనిల్ 2 మి.లీ./ ఫ్లూబెండమైడ్ 0.1 మి.లీ / బెల్ట్ ఎక్స్పర్ట్ (ప్లూబెండమైడ్ + థయో క్లోప్రిడ్) 1-1.5 మి.లీ/ పోలీస్ 0.5 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
    తెగులు :
    అగ్గి తెగులు నివారణకు – ట్రై సైక్లోజోల్ ax% 0.6 గ్రాములు/ ఐసోప్రోథయోలిన్ 40% 1.5 మి.లీ./ కసుగామైసిన్ 3 %
    యస్.యల్. 2.5 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
    కంది పంట : శాఖీయ దశలో ఉన్నది.
    వెర్రి తెగులు / కుచ్చు వైరస్ తెగులు – ఇది నల్లి ద్వారా వ్యాపిస్తుంది.
  • 30-40 రోజుల వయస్సు పైరుకు నీటిలో కరిగే గంధకం 3 గ్రాములు లీతారు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
  • 50 రోజుల వయస్సు పైరు నుండి ప్రాపర్ గైట్ 2 మి.లీ./ ఫెనాకి 1.5 మి.లీ./
    పెరాక్సిమేట్ 1.5 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.

ఎండుతెగులు – కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు/కార్బండిజం 1 గ్రాము లీటరు నీటికి కలిపి, స్ప్రేయరు నాజిల్ తీసి మొక్క మొదలు చుట్టూ వేరు మండలం తడిచేలా మందు నీరు పోయాలి. పిచికారి చేయరాదు.
గూడు/బూజు పురుగు (మారుక మచ్చల పురుగు)

  • కళ్ళేకు రాకముందే వేపనూనె గాడతను (PPM) అనుసరించి 10,000 PPM 2 మి.లీ./5000 PPM 3మి.లీ/300 నుండి 1500 PPM 5 మి.లీ చొప్పున లీటరు నీటికి కలిపి 2,3 సార్లు పిచికారీ చేసిన యెడల గ్రుడ్డుదశ నివారించవచ్చు.
  • పూతకు వచ్చి గూడు ఏర్పడిన తర్వాత పురుగు మందులు పిచికారీ మొదలు పెట్టిన యెడల పురుగు చేసిన నష్టంతో పాటు, పూత కూడా రాలిపోయే ప్రమాదం ఉంది కనుక కళ్ళేకు రాకముందే నివారణ చేపట్టాలి.
    ప్రత్తి –
  • పూత దశనుండి కాయ ఏర్పడే దశ
  • మెగ్నీషియం లోపం – మెగ్నీషియం సల్ఫేట్ 10 గ్రాములు లీటరు నీటికి కలిపి 7-10 రోజుల వ్యవదిలో పైరు వేసిన 45 మరియు 75 రోజుల తర్వాత 2 సార్లు పిచికారీ చేయాలి.
    రసంపీల్చే పురుగులు
    తెల్లదోమ పసుపు రంగు జిగురు అట్టలు 20/ఎకరానికి తెల్లదోమ నివారణకు డైఫెన్తియురాన్ 1.25 గ్రా/ ఎసిటామిప్రిడ్ 0.2 గ్రా/ప్రొఫెనోఫాస్ 2 మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.

  • తామరపురుగు, పచ్చదోమ, పేనుబంక
    నీలం రంగు జిగురు అట్టలు 20/ఎకరానికి తామర పురుగులు నివారణకు. –
    పచ్చదోమ, పేనుబంక మరియు తామర పురుగులు వీపనూనే 10,000 ppm 2 మి.లీ./ 5000 ppm 3 మి.లీ./ 300-1500 ppm 5 మి.లీ లీటరు నీటికి పురుగు మందుతో పాటు కలిపి పిచికారీ చేయాలి. –
  • ఎసిఫేట్ 1.5 గ్రాములు/ ప్రొఫెనోఫాస్ 2 మి.లీ/ డైఫెన్తియురాన్ 1.25 గ్రాములు/ ఇమిడాక్లోప్రిడ్ 0.4 మి.లీ./ ఎసిటామిప్రిడ్ 0.2 గ్రాములు / ఫిప్రోనిల్ 2 మి.లీ/ ఫ్లోనికామిడ్ 0.3 గ్రాములు లీటరు నీటికి.
  • 100 రోజుల లోపు పైరుపై పైరిత్రాయిడ్ మందులు పిచికారీ చేయరాదు. చేసిన యెడల రసం పీల్చు పురుగుల ఉదృతి పెరుగుతుంది.
    గులాబిరంగు పురుగు
    లింగాకర్షక బుట్టలు ఎకరానికి 10 చొప్పున అమర్చాలి..
    3 నెలల వయస్సు లోపు పంట పై క్వినాల్ ఫాస్ 2.5 మి.లీ/ క్లోరిపైరిఫాస్ 2.5 మి.లీ/ ప్రొఫెనోఫాస్ 2 మి.లీ/ ఇండాక్సాకార్బ్ 1 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
    పంట వయస్సు 3 నెలలు దాటిన తర్వాత మాత్రమె అవసరాన్ని బట్టి సింథటిక్ పైరిత్రాయిడ్ మందులైన సైపర్ మెత్రిన్ 1 మి.లీ/ లామ్దసైహాలోత్రిన్ 1 మి.లీ/ డెల్టామెట్రిన్ 1 మి.లీ/ బైఫెనిత్రిన్ 2 మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
    అని వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *