సమాచార పౌర సంబంధాల శాఖ డివిజినల్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ (డి.ఎల్. పి.ఆర్. ఓ)గా దాసరి దుర్గా ప్రసాద్ శనివారం బాధ్యతలు చేపట్టారు. జిల్లా కార్యాలయంలో సహాయ పౌర సంబంధాల అధికారి (ఎపీఆర్ ఓ)గా పనిచేస్తున్న దుర్గా ప్రసాద్ కు డివిజినల్ పబ్లిక్ రిలేషన్స్ అధికారిగా పదోన్నతి పొందారు. దీంతో డి.ఎల్ .పి .ఆర్.ఓ గా శనివారం బాధ్యతలు చేపట్టారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఎఎస్ దినేష్ కుమార్ ను మర్యాద పూర్వకంగా కలిసి పుష్ప గుచ్చం అందించారు. పదోన్నతి పొందిన దుర్గా ప్రసాద్ ను కలెక్టర్ అభినందించారు. కలెక్టర్ కార్యాలయ ఉద్యోగులు, డీఎల్పీ.ఆర్.ఓ కార్యాలయం సిబ్బంది, పలువురు జర్నలిస్ట్ లు దుర్గా ప్రసాద్ కు అభినందనలు తెలిపారు.
