వేస్ట్ పీకింగ్ కార్మికులు, జీవనోపాదులను మెరుగుపరచుకోవాలి . మండల వ్యవసాయ అధికారి, బి ప్రసాద రావు

గ్రామస్థాయిలో వేస్ట్ పీకింగ్ చేస్తున కార్మికులు ఆ వృత్తుల నుండి విముక్తి చెంది వారు జీవనోపాదులను మెరుగుపరచుకొనుటకు కొరకు చిరు వ్యాపారాలను ప్రోత్సహించట కొరకు దళిత బహుజన రిసోర్స్ సెంటర్ స్వచ్ఛంద సంస్థ చేస్తున్న ఈ మహోన్నతమైన కార్యక్రమo అభినందనీయమని తాళ్లూరు మండల వ్యవసాయ అభివృద్ధి అధికారి బి ప్రసాద రావు కొనియాడినారు. దారoవారిపాలెం గ్రామంలో వేస్ట్ పీకింగ్ చేస్తున్న కుటుంబాలకు డి బి ఆర్ సి సంస్థ కిరాణా, ప్లాస్టిక్ వ్యాపార ప్రారంభోత్సవ కార్యక్రమo లో ఆయన మాట్లాడినారు. ఈ కార్యక్రమంలో దళిత బహుజన రిసోర్స్ సెంటర్ రీజనల్ కోఆర్డినేటర్ దార్లకోటేశ్వర రావు మాట్లాడుతూ … వేస్ట్ స్పీకింగ్ మరియు డిఎన్టి కుటుంబాల సంక్షేమం కొరకు మా స్వచ్ఛంద సంస్థ ద్వారా వేస్ట్ స్పీకింగ్ చేస్తున్న కుటుంబాలకు ఆ వృత్తి నుండి విముక్తి చేసి వారి జీవనోపాదులు పెంపొందించు కొరకు కిరాణా, ప్లాస్టిక్ వస్తువులు అమ్ముకొనుటకు ఆర్థిక సహాయం చేయటం జరుగుతున్నదని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డి బి ఆర్ సి ఏరియా కో-ఆర్డినేటర్ గోపన బోయిన వెంకటరావు, గ్రామ వాలంటీర్స్ ఆబోతు చిరంజీవి, జి ఏసుదాసు, గ్రామ ఐక్య సంఘం సభ్యురాలు గోపనబోయిన అంజమ్మ, నాగులూరి స్వామియేలు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *