ప్రజారోగ్య సంరక్షణేప్రభుత్వ ధ్యేయం – ముండ్లమూరు మండల జెసిఎస్ కన్వీనర్ మేడికొండ

ప్రజారోగ్య సంరక్షణే ప్రభుత్వ ధ్యేయమని మండల జెసిఎస్ కన్వీనర్ మేడికొండ జయంతి అన్నారు. ముండ్లమూరు మండలంలోని పూరి మెట్ల గ్రామంలో శని వారం జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్య క్రమం తహసిల్దార్ మహమ్మద్ నయీమ్ అహ్మద్ హాజరైనారు. ఈ సందర్భంగా జె సి ఎస్ కన్వీనర్ జయంతి మాట్లాడుతూ …గతంలో ఎవరు చేయని విధంగా ప్రభుత్వం వైద్య రంగానికి ప్రాధాన్యత కల్పిస్తుందన్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి విద్యకు ఎంత ప్రాముఖ్యత ఇచ్చారో ఆరోగ్య రంగానికి కూడా అంతే ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. ఇటువంటి మహత్తర కార్యక్రమాన్ని అమలు చేస్తున్న సీఎం జగన్ కు ప్రజలంతా రుణపడి ఉంటారన్నారు. వ్యాధులతో బాధపడుతున్నప్పటికీ ఆర్థిక స్తోమత లేక ఇంటికె పరిమితమైన పేదలకు ఈ ఆరోగ్య సురక్ష కార్యక్రమం ఎంతో మేలు చేస్తుందన్నారు. ఈ వైద్య శిబిరానికి ఒంగోలు రిమ్స్ స్పెషలిస్ట్ వైద్యులు ఫిరోజ్ అన్వర్, ప్రియాంక ల పర్యవేక్షణలో ముండ్లమూరు , మారెళ్ళ వైద్యాధికారులు సిహెచ్ ప్రవీణ్ కుమార్, ఎం జాస్మిన్ లు 370 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి పలు రకాల వ్యాధులకు మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ నాగేశ్వరరావు, హెల్త్ ఎడ్యుకేటర్ కే ఏ రాజు, హెల్త్ అసిస్టెంట్ ఎస్ కే యం యం సుభాని, ఏం ఎల్ హెచ్ పి వి కిరణ్, హెల్త్ విజిటర్ కే అంజమ్మ, స్టాఫ్ నర్స్ లు జి బుజ్జి బాబు, సిహెచ్ ఆదిలక్ష్మి, ఏఎన్ఎం ఎస్కే మేరా బి, పి పద్మాంజలి, బి ఆంజనీలత, టి శిరీష, ఎం ఎల్ హెచ్ పి కే జయశ్రీ, బి రత్నకుమారి, ఎం దీప్తి, వి రాజేశ్వరి, తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *