వాహనదారులు ప్రజలు రోడ్డు ప్రమాదాలపై అప్రమత్తతో ఉండాలని ముళ్ళమూరు ఎస్సై యు వి కృష్ణయ్య అన్నారు. మండలంలోని పులిపాడు, రెడ్డి నగర్, ఉలగల్లు, పసుపుగల్లు, ముండ్లమూరు గ్రామాలలో శనివారం నో యాక్సిడెంట్ డే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు తలకు హెల్మెట్ ధరించి ప్రయాణం చేయాలని, కారు నడిపేవారు సీటు బెల్టు ధరించి డ్రైవింగ్ చేయాలని తెలిపారు. మద్యం తాగి వాహనాలు నడుపుతూ ప్రమాదాలు కొని తెచ్చుకోవద్దని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ ప్రయాణ సమయాలలో పలు జాగ్రత్తలు తీసుకొని సురక్షితంగా ఇంటికి చేరాలన్నారు. పలు ప్రాంతాలలో ఉన్న బ్రిడ్జిలు దిమ్మెలకు రేడియం స్టిక్కర్లు వేసి ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
