భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య(DYFI) ఆధ్వర్యంలో ప్రపంచ విప్లవకారుడు చేగువేరా వర్ధంతిని దర్శి లోనీ సుందరయ్య భవన్లో నిర్వహించడం జరిగింది. అనంతరం ప్రపంచ విప్లవకారుడు చేగువేరా చిత్రపటానికి డివైఎఫ్ఐ మాజీ నాయకులు ఉప్పు నారాయణ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు కేవీ పిచ్చయ్య మాట్లాడుతూ …… ప్రపంచ మానవాళి విముక్తి కోసం, భౌగోళిక సరిహద్దులతో సంబంధం లేకుండా అమెరికన్ సామ్రాజ్యవాద దోపిడీకి వ్యతిరేకంగా ఆఖరి క్షణం వరకు పోరాడిన ధీరుడు కోట్లాదిమంది యువత గుండెల్లో నిలిచిన గెరిల్లా యోధుడు చేగువేరా. చేగువేరా ఒక గేరెల్లా విప్లవకారుడు, మనసున్న డాక్టర్, మహాకవి, గొప్ప రచయిత , ప్రాణమిచ్చే స్నేహితుడని, క్యూబా అభివృద్ధి కోసం పోరాడిన యోధుడు, అన్నిటికి మించి అమెరికా సామ్రాజ్యవాదులకు సింహ స్వప్నం. ఆయన జీవితమే నేటి తరానికి ఆదర్శం. చేగువేరా అర్జెంటీనా లోని రోసారియోలో 1928 జూన్ 14 న జన్మించారు. వైద్యశాస్త్రంలో పట్టభద్రులు అయ్యాడు. చేగువేరా తన మిత్రుడు లతో కలిసి లాటిన్ అమెరికాను మొత్తం మోటార్ యాత్ర ద్వారా చుట్టేశారు. ఈ దోపిడీని అరికట్టాలని, పేద ప్రజలకు అండగా నిలబడాలని మోటారు సైకిల్ యాత్రలోనే ఒక నిర్ణయానికి వచ్చాడు. వైద్యుడిగా కొంతమంది రోగులకు వైద్యం చేసే బదులు సమాజానికి పట్టిన అత్యంత ప్రమాదకరమైన జబ్బును వదిలించాలనుకున్నాడు. సామ్రాజ్యావాదానికి వ్యతిరేకంగా పోరాడి క్యూబాలో విప్లవాన్ని విజయవంతం చేశాడు. ప్రపంచంలో ఎక్కడ ఎవరికి అన్యాయం జరిగినా స్పందించగలగాలి. నేడు ఈ మాటే కోట్లాది మంది యువతకు ఆదర్శంగా మారింది. సమాజంలో జరుగుతున్న అన్యాయాన్ని, అణచివేతను యువత ప్రశ్నించాలి. అన్నారు
ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ మండల అధ్యక్షులు ఆర్ జె సి పాల్. నాయకులు కంట వెంకటరావు.మాజీ డివైఎఫ్ఐ నాయకులు ఉప్పు నారాయణ. సిహెచ్ ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.
