జిల్లాలో జగనన్న పాలవెల్లువ అమలు తీరు, చేయూత, ఆసరా లబ్ధిదారులు జగనన్న పాల వెల్లువకు అనుసంధానం, 4వ విడత జేపీవి విస్తరణ, తదితర అంశాలపై డిస్ట్రిక్ కోర్ టీమ్, అమూల్ ప్రతినిధులు, ఎపిడిడిసిఎఫ్, డిసిసి సభ్యులతో కలెక్టర్. శ ఎ.ఎస్. దినేష్ కుమార్ గారు సమీక్షా సమావేశం నిర్వహించారు.
చేయూత, అసరా పథకాలలో పాడి పశువులను కొనుగోలు చేసిన లబ్ధిదారులను జేపీవీకి అనుసంధానించడం ద్వారా పాడి రైతులకు గరిష్ఠ లబ్ధి చేకూరేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పథకం యొక్క లక్ష్యాలు, ఒనగూరే లబ్ధి గురించి క్షేత్రస్థాయిలో విస్తృతంగా ప్రచారం: చేయాలని, ప్రతీ ఏఎంసీయూ (పాలకేంద్రం)లో 11 మంది ప్రమోటర్లు, సెక్రటరీ సమర్థవంతంగా పనిచేసేలా చూడాలని నిర్దేశించారు. రాబోయే రెండు వారాల్లో నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవాలని, నిర్లక్ష్యం, అలసత్వం ప్రదర్శిస్తే క్రమశిక్షణా చర్యలు తప్పవని హెచ్చరించారు. అందరి మధ్య సమన్వయం చేసి మెరుగైన ఫలితాలను సాధించాలని దీసీఓ /జేపీవి నోడల్ ఆఫీసర్ ను ఆదేశించారు. కార్యక్రమంలో దీసీఓ/జేపీవీ నోడల్ ఆఫీసర్ పి. రాజశేఖర్, జడ్పీ సీఈవో జాల్ రెడ్డి, జెడ్ అనిమల్ హుస్బందారీ, ఏపీ డీడీసీఎఫ్, అమూల్ ప్రతినిధులు, డిసిసి సిబ్బంది,తదితరులుపాల్గొన్నారు.


