నూతన సాంకేతిక పరిజ్ఞానంతో పొగనారుమళ్లు చేపడితే నాణ్యమైన పొగాకు ఉత్పత్తులతో రైతులకు మంచి గిట్టుబాటు ధర వస్తుందని ఐటీసీ అధికారి యశ్వంత్ అన్నారు. పొగాకు బోర్డు ఒంగోలు -2 వేలం నందు పొగాకు రైతులకు పంట నియంత్రణపై సదస్సు నిర్వహించారు. సదస్సులో ఐటీసీ అధికారి యశ్వంత్ మాట్లాడుతూ… ట్రేలలో పొగాకు నారు పెంచటం వలన నూరుశాతం మొలక వస్తుందని, పోషకాలు కూడ సక్రమంగా అందివచ్చని అన్నారు. పొగాకు పంటకు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని శనగ, కంది, మిరప వైపు మొగ్గు చూపాలని కోరారు. ఒంగోలు-2 వేలం నిర్వాహణాధికారి వి రామక్రిష్ణ మాట్లాడుతూ కౌలు భూములు, బ్యారన్లతో పొగాకు సాగు చేపట్టవద్దని, బోర్డు అనుమతి ఇచ్చిన మేరకు మాత్రమే బ్యారణ్ కు 3550 కేజీల మాత్రమే సాగు చెయ్యాలని కోరారు. ఫీల్డ్ ఆఫీసర్ ఎస్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

