చిరుధాన్యాలతో ఆరోగ్య భద్రత – ఐసిడిఎస్ ఆధ్వర్యంలో పౌష్టికాహార ప్రదర్శన నిర్వహ ణ -ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా పలు సూచనలు చేసిన వ్యవసాయ అధికారి – తిలకించిన ప్రజాప్రతినిధులు

చిరుధాన్యాలతో ఆహార భద్రత, ఆరోగ్య భద్రత లభిస్తా యని మండల వ్యవ సాయ అధికారి బి. ప్రసాదావు అన్నారు. తాళ్లూరులో కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాల లో సోమవారం ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా చిరుధాన్యాలతో తయారైన వంటకాలను ప్రదర్శించారు. ఐసీడీఎస్ ఆధ్వర్యంలో చిరుధాన్యాలతో తయారైన వంటకాలు ప్రదర్శన ఏర్పాటు చేశారు. జెడ్పిటిసి మారం వెంకటరెడ్డి, మండల ఉపాధ్యక్షులు ఐ వెంకటేశ్వర్రెడ్డి, గ్రామ సర్పంచ్ మేకల చార్లెస్ సర్జన్, పార్టీ అధ్యక్షుడు టీవీ సుబ్బారెడ్డి, కో ఆప్షన్ సభ్యులు కరీముల్లా, తాళ్లూరు ఏజెన్సీ వైద్యాధికారి డాక్టర్ షేక్ ఖాదర్ మస్తాన్ బి ఎంఈఓ జి సుబ్బయ్య ఏవో ప్రసాదరావు సర్పంచులు వలి, పి. సుమలత శ్రీకాంత్ రెడ్డి, కోఆప్షన్ మెంబెర్ కరిముల్లా తదితరులు తిలకించారు. వ్యవసాయ శాఖ ఐసీడీఎస్ సిబ్బందిని అభినందించారు. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి ప్రసాదరావు మాట్లాడుతూ… ఎక్కువ నీరు అవసరం లేకుండా పండే జొన్నలు, సజ్జలు, రాగులు, కొర్రలు, ఊదలు, అవిసెలు, సాములు, తదితర వాటిని పండించి వాటిని ఉపయోగించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఆయన తెలిపారు. చిరుధాన్యాలతో తయారైన వంటకాలు ఆరో గ్యాన్ని ప్రసాదించడంతో పాటు ఆహార భద్రతను కూడా కల్పిస్తాయని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ జ్యోతి, అంగన్వాడీ కార్యకర్తలు సిబ్బంది పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *