దీపావళి బాణాసంచా విక్రయించేందుకు తాత్కాలిక దుకాణములు ఏర్పాటు ఏర్పాటుపై బుధవారం
జిల్లా రెవిన్యూ అధికారి ఆర్ శ్రీలత ప్రకాశం జిల్లా వారి ఛాంబర్ లో సంబంధిత రెవిన్యూ, పోలీస్, మునిసిపల్, విపత్తు ప్రతిస్పందన మరియు అగ్నిమాపక, పంచాయితీ శాఖల అధికారులు మరియు మీసేవ ఏజెన్సీ నిర్వహకులతో సమావేశం నిర్వహించారు.
సమావేశంలో పలు ముఖ్య విషయంలో పై చర్చించారు అందులో ముఖ్యంగా…
దీపావళి పండుగకు జిల్లా లోని బాణాసంచా విక్రయించేందుకు ఆసక్తి గల వ్యాపారులు తాత్కాలిక క్రాకర్స్ లైసెన్స్ కొరకు తేది 2023 అక్టోబర్ 19 నుండి 2023 అక్టోబర్ 28 లోపు మీసేవ కేంద్రములు/ గ్రామ & వార్డ్. సచివాలయ కేంద్రాల ద్వారా ధరఖాస్తు చేసుకొనవలెను
1) ధరఖాస్తు (మీసేవ కేంద్రములలో/గ్రామ & వార్డ్ సచివాలయ కేంద్రాలలో)
2) చిరునామా ప్రూప్ నకలు
3) ఆధార్ నకలు
4) మూడు పాస్ పోర్ట్ సైజు ఫోట్స్
5) జనన ధృవీకరణ పత్రము (18సం.ల లోపు వారికి అనుమతి ఇవ్వబడదు).
6) అఫిడవిట్ (రూ10/- స్టాంప్ పేపర్ పై నోటరి చేయి౦చవలెయను)
7) వాణిజ్య శాఖ అధికారి వారి NOC.
8) పోలీసు శాఖ వారి ధృవీకరణ పత్రం
9) విపత్తు ప్రతిస్పందన మరియు అగ్నిమాపక విభాగం నుండి ధృవీకరణ పత్రం
10) స్థానిక సంస్థల నుండి ధృవీకరణ పత్రం (పంచాయతి / మున్సిపాలిటీ)
పై తెలిపిన పత్రములు దరఖాస్తు తో జతపరచాలని తెలిపారు.
ఒంగోలు నగరము నందు దుకాణములకు మునిసిపల్ శాఖ వారు నెంబర్లు కేటాయించెదరని … మార్కాపూరం/కనిగిరి/చీమకుర్తి/గిద్దలూరు/దర్శి మునిసిపల్ కమీషనర్లు మరియు తహసిల్దార్లు/పోలీస్ ఇన్స్పెక్టర్స్ వ్యక్తిగత పర్యవేక్షణ చేసి దీపావళి సామగ్రి విక్రయించుటకు అనువైన ప్రాంతములను గుర్తించాలి. సంబంధిత అధికారులు గుర్తించిన ప్రదేశాలలో తప్ప ఏ ఇతర ప్రాంతాలలో కానీ రద్దీగా ఉండే ప్రదేశములలో, జనావాసాల మధ్య కానీ దీపావళి సామగ్రి విక్రయించడానికి అనుమతి మంజూరు చేయబడదు. దరఖాస్తు పరిశీలన అనంతరము …సబ్ కలెక్టర్, మార్కాపురం మరియు రెవిన్యూ డివిజినల్ అధికారి, ఒంగోలు/కనిగిరి, ప్రకాశం జిల్లా వారు లైసెన్స్ లు జారీ చేయుదురు. తేది 2023 నవంబర్ 10 నుండి 2023 నవంబర్ 12(3రోజులు మాత్రమే) వరకు బాణాసంచా సామాగ్రి అమ్మకాలు జరుపవలెను
తేది 12.11.2023 న సాయంత్రం 7.00 గంటలకు స్టాల్స్ ఖాళీ చేయవలెనని తెలిపారు.
దీపావళి పండుగ సందర్భంగా ఎటువంటి ప్రమాదాలు జరుగకుండా అగ్ని మాపక/ రెవిన్యూ/పోలీస్/మునిసిపల్/ పంచాయితీ తదితర శాఖల అధికారులు స్వయంగా పర్యవేక్షించి ముందు జాగ్రత్తలు తీసుకోనవలెనని నిర్ణయించారు.
దీపావళి బాణాసంచా అక్రమంగా తయారు చేయుట మరియు నిల్వలు చేయుట ప్రమాదకరము . మరియు చట్టరీత్య నేరము. జిల్లాలో ఎవరి అనుమతి లేకుండా తయారు చేయుచున్న, నిల్వలు ఉంచినా అమ్మకం చేసినా రెవిన్యూ, పోలీస్, విపత్తు ప్రతిస్పందన మరియు అగ్నిమాపక శాఖ వారికి తెలియచేయవలసినది గా కోరుతున్నట్లు తెలిపారు.
దీపావళి బాణాసంచా విక్రయించేందుకు తాత్కాలిక దుకాణములు ఏర్పాటు ఏర్పాటుపై సంబంధిత శాఖలతో సమావేశం నిర్వహణ- పాల్గొన్నజిల్లా రెవిన్యూ అధికారి ఆర్ శ్రీలత
18
Oct