బిజెపి రాష్ట్ర ఎస్సీ మోర్చా సెక్రటరీగా వేముల మోజీ నియామకం.- అభినందనలు తెలిపిన భాజపా జిల్లా మీడియా ఇంఛార్జ్ ధనిశెట్టి రామునాయుడు.

భారతీయ జనతాపార్టీ రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు గా పేముల మోజీ నియమితులయ్యారు. పేముల మోజీ గత 25 సంవత్సరాల నుండి తమ సామాజిక వర్గ సమస్యల పరిష్కారం దిశగా నిత్యం అవిశ్రాంతంగా కృషిచేస్తున్నారు. మరియు ఎల్లప్పుడూ ప్రజాక్షేత్రంలో ఉంటూ, తమదైన శైలిలో ప్రజా ప్రయోజనాల పట్ల తమ బాధ్యతను గుర్తించి పాలకపక్షాలతో చర్చించి వాటి సాధన దిశగా పోరు సాగిస్తున్నారు. ఎమ్మెస్ నైన్ ఛానల్ అధినేతగా రాజకీయాలకతీతంగా ప్రజా సమస్యల మీద, మౌలిక సదుపాయాల రూపకల్పనలపై కథనాలను ప్రచారం చేస్తూ తనదైన ముద్రను ఏర్పరచుకొన్నారు. భారతీయ జనతా పార్టీ ఎలాంటి కార్యక్రమం అప్పజెప్పినా సక్రమంగా నిర్వర్తించేవారు. వ్యక్తిగతంగా, అటు జిల్లా ను, రాష్ట్ర పార్టీలోనూ గొప్ప నాయకుడిగా పేరు సంపాదించారు. మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్లో పార్టి తరపున పేముల మోజీ చేసిన కృషి ఎంతో ఉన్నదని, సరియైన వ్యక్తికి సరియైన బాధ్యత లభించిందని, స్వార్ధ రహిత నాయకులకు అధిష్టానం ఎప్పుడు ముందు పీట వేస్తుందని బిజెపి జిల్లా మీడియా ఇంచార్జ్ దనిశెట్టి రాము నాయుడు తెలిపారు. ఈ సందర్భంగా పేముల మోజికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *