ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం ద్వారా అమలవుతున్న పనులకు సంబంధించి గ్రామాల్లో ఏ ఏ పనులు అవసరమవుతాయో వాటిని గుర్తించాలని ఉపాధి పథకం క్వాలిటీ కంట్రోల్ డి ఈ శాంతారావు అన్నారు. స్థానిక వైకెపి కార్యాలయంలో గురువారం ముండ్లమూరు తాళ్లూరు మండలాల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2024 -2025 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి గ్రామాలలో 97 రకాల పనులను గుర్తించేందుకు ఫీల్డ్ అసిస్టెంట్లు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు, అగ్రికల్చర్అసిస్టెంట్లు సంయుక్తంగా గ్రామాల్లో తిరిగి గ్రామసభలు ఏర్పాటు చేసి గ్రామ ప్రజల సహకారంతో పనులు గుర్తించాలని తెలిపారు. పనులు గుర్తింపులో జాప్యం జరిగితే సహించేది లేదన్నారు. ఈ కార్యక్రమంలో ముండ్లమూరు ఎంపీడీవో ఎన్ వి ఎల్ హనుమంతరావు, తాళ్లూరు ఎంపీడీవో వజ్జా శ్రీనివాసరావు, ఏపీవో బి మురళి, ఈసీ ప్రసాదు, తదితరులు పాల్గొన్నారు

