ప్రజల చెంతకు పాలనే కాదు వైద్యాన్ని కూడా తీసుకువచ్చిన సీఎం జగన్ మోహన్ రెడ్డి పరిపాలన దేశ చరిత్రలో మైలురాయిగా మిగిలిపోతుందని ఎంపీపీ సుంకర సునీత బ్రహ్మానంద రెడ్డి, మండల జే సి ఎస్ కన్వీనర్ మేడికొండ జయంతి అన్నారు. మండలంలోని పోలవరం గ్రామంలో గురువారం ఆ గ్రామ సర్పంచి నంబూరి లీలమ్మ అధ్యక్షతన జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమం ఎంపీడీవో ఎన్ వి ఎల్ హనుమంతరావు ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా ఎంపీపీ సుంకర సునీత బ్రహ్మానంద రెడ్డి మాట్లాడుతూ గత పాలకుల హాయంలో ప్రభుత్వ ఆసుపత్రులకు రావాలంటేనే జనం భయపడే వారని చెప్పారు. ఆ దుస్థితికి చమరగితం పాడి వైద్యాన్ని గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల చెంతకు చేర్చి ప్రజల కోసమే ప్రభుత్వం అని సీఎం జగన్మోహన్ రెడ్డి నిరూపించారన్నారు. మండల జెసిఎస్ కన్వీనర్ మేడికొండ జయంతి మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యానికి ప్రాధాన్యత నిస్తూ డాక్టర్ వైయస్సార్ ఆరోగ్యశ్రీ పథకంలో సుమారు3500 వ్యాధులకు పైగానే ఉచితంగా కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్యాన్ని అందించేలా సీఎం జగన్మోహన్ రెడ్డి చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో గత నాలుగున్నర ఏళ్లలో ముఖ్యమంత్రి ఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనకు ప్రజలు ముగ్ధలవుతున్నారని తెలిపారు. ఈ వైద్య శిబిరంలో ఒంగోలు రిమ్స్ స్పెషలిస్ట్ వైద్యులు ఫిరోజ్ అన్వర్, ప్రియాంక తో పాటు మారెళ్ళ ముండ్లమూరు వైద్యాధి కారులు బి మధు శంకర్, వి జ్యోతి లు 375 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. అదేవిధంగా కంటి సమస్యలు ఉన్నవారికి ఆప్తమాలిక వైద్యులు ఏ నరసింహారావు కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ఓ వెంకటరావు, హెచ్ఇ కే ఏ రాజు, హెచ్ వి కే అంజమ్మ, సూపర్వైజర్ నాగేశ్వరరావు, హెల్త్ అసిస్టెంట్ ఎస్ కే యం యం సుభాని ఎంఎల్ఓ భీమిరెడ్డి నాగమల్లేశ్వరరెడ్డి, ఏఎన్ఎం ఇందిరా ప్రియదర్శిని, ఎం ఎల్ హెచ్ పి కే శశి, కే జయశ్రీ, వి రాజేశ్వరి, బి రత్నకుమారి, ఎం దీప్తి, ఎం శరణ్య, వి కిరణ్, 104 సిబ్బంది వెంకట ప్రసాద్, వినోద్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.




