పొగనారు మడుల పెంపకం యాజమాన్యంపై రైతులు ప్రత్యేక సూచనలు పాటించి నాణ్యమైన దిగుబడులు పొందాలని ఒంగోలు-2 వేలం నిర్వాహణాధికారి కోవి రామక్రిష్ణ అన్నారు. మద్దిరాల పాడులో పొగాకు రైతులకు నీటి తడుల యాజమాన్యం మరియు పంట నియంత్రణపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. పాల్గొన్న ఒంగోలు-2 వేలం నిర్వాహణాధికారి కోవి రామక్రిష్ణ మాట్లాడుతూ … నారును ట్రేలో పెంచినట్లయితే నాణ్యత దిగుబడి మంచిగా వస్తుందని అన్నారు. సరైన వయస్సు గల నారును మాత్రమే ఉపయోగించాలని అన్నారు. నారుమళ్లలో సమగ్ర సస్యరక్షణ పాటించాలని కోరారు. పంట నియంత్రణ పాటించాని కోరారు. ఐటీసీ అధికారి జి. వెంకటరావు మాట్లాడుతూ నూతన సాంకేతిక పరిజ్ఞానంతో పొగారు నారు మడులు పెంచినట్లయితే నాణ్యమైన పొగాకు ఉత్పత్తి అవుతుందని అన్నారు. ట్రేలలో వంద శాతం పొగనారు మొలక వస్తుందని చెప్పారు. ఫీల్డ్ అఫీసర్ ఎస్ వెంకటేశ్వర్లు, పీఎస్ఎస్ఏహెచ్ రామాంజనేయులు, జీపీఐ యు శ్రీనివాసులు, సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం రైతులకు మొక్కలు పంపిణీ చేసారు.

