రైతులకు అవసరమైన సేవలను లక్ష్యం మేరకు అందించటంలో వ్యవసాయ అనుబంధ శాఖలు సమన్వయంతో పనిచెయ్యాలి – జాయింట్ కలెక్టర్ కె శ్రీనివాసులు- జిల్లా వ్యవసాయ సలహా కమిటీ సమావేశం నిర్వహణ

రైతులకు అవసరమైన సేవలను లక్ష్యం మేరకు అందించటంలో వ్యవసాయ అను బంధ శాఖలు సమన్వయంతో పనిచెయ్యాలని జిల్లా జాయింట్ కలెక్టర్ కె. శ్రీనివాసులు కోరారు. కలెక్టరేట్లోని స్పందన హాల్లో శుక్రవారం జిల్లా వ్యవసాయ సలహా కమిటీ సమావేశం నిర్వహించారు. వీడీసీసీ బ్యాంకు డైర్మన్ వైఎం ప్రసాద్ రెడ్డి జాయింట్ కలెక్టర్ కె. శ్రీనివాసులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. జాయంట్ కలెక్టర్ శ్రీనివాసులు మాట్లాడుతూ.. కౌలు రైతులకు రుణాలు మంజూరు చేయటంతో తగిన చర్యలు తీసుకోవాలని. రుణాలు పొందిన కౌలు రైతుల వివరాలను పరిశీలించాలని కోరారు. ఘర్ ఘర్ కెసిసి అభియాన్ కార్యక్రమలను విస్తృత స్థాయిలో ప్రచారం నిర్వహించి అవగాహన కల్పించాలని కోరారు. పీఎం కిసాన్లో అందరూ లబ్ధిపొందేలా చూడాలని కోరారు. ప్రభుత్వ లక్ష్యం మేరకు పూర్తి స్థాయిలో ప్రయోజనం దక్కేలా మండల స్థాయి అధికారులు పనిచెయ్యాలని ఆదేశించారు. జిల్లా స్థాయి అధికారులు పూర్తి స్థాయిలో పర్యవేక్షించాలని కోరారు. జిల్లా వ్యవసాయ సలహా కమిటీ చైర్మన్ ఆళ్ల రవీంద్రా రెడ్డి మాట్లాడుతూ …శనగ సాగుకు ఇస్తున్న సబ్సిడీ విత్తనాల పరిమాణాన్ని సబ్సిడీ రేటును పెంచేలా చర్యలు తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వానికి, కృషి చేసిన అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. రబీ సీజన్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా విత్తనాలు త్వరగా సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. విపత్తులు, ప్రమాదాలతో చనిపోయిన పశువుల యజమానులకు త్వరగా పరిహారం అందేలా చూడాలని విన్నవించారు. ఉద్యాన పంటలు సాగు చేస్తున్న రైతులకు కూడ అందాల్సిన రాయితీని త్వరగా వారి బ్యాంకు ఖాతాలలో జయ అయ్యే లా అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.
జిల్లా వ్యవసాయాధికారి శ్రీనివాసరావు మాట్లాడుతూ… రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ లక్ష్యం మేరకు వీటి నాణ్యతా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ముందుగా గత సమావేశంలో చర్చించిన అంశాలు, వాటిపై తీసుకున్న చర్యలు, పీఎం కిసాన్, ఈకెవైసీ, సీసిఆర్సీ కార్డుల స్థితి గతులపై అధికారులు వివరించారు. కార్యక్రమంలో జిల్లా ఉద్యాన శాఖ అధికారి గోపి చంద్, ఎపిఎంపి పీడీ పివి రమణ, పశుసంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ కాలేషా, మత్యశాఖ సహాయ సంచాలకులు ఉష, ప్రకృతి వ్యవసాయ జిల్లా ప్రాజెక్టు మెనేజర్ సుభాషిణి, మార్కెఫెడ్ డీఎం హరిక్రిష్ణ, ఎల్డీఎం అబ్ధుల్ రహీం, ఆత్మ పిడి అన్నపూర్ణ, పౌర సరఫరాల సంస్థ జిల్లా మెనేజర్ గ్లోరియా. ఎపీ విత్తనాభివృద్ధి సంస్థ జిల్లా మెనేజర్ సుమలత, నాబార్డు డిడిఎం రవికుమార్, మండల వ్యవసాయ అధికారులు వ్యవసాయ శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *