ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టినట్లు జాయింట్ కలెక్టర్ కె.శ్రీనివాసులు చెప్పారు. శుక్రవారం కలెక్టరేట్లోని స్పందన హాలులో “ఎంప్లాయీస్ గ్రీవెన్స్” కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు.
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఉత్తర్వుల మేరకు ప్రతి నెలా 3వ శుక్రవారం ఎంప్లాయీస్ గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఉద్యోగుల సర్వీసు అంశాలలో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరిస్తామని, పనిచేస్తున్న ప్రదేశంలో వారికి అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పిస్తామని చెప్పారు. ఉద్యోగులు ఇచ్చిన అర్జీలను పరిశీలించి త్వరగా పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులను ఆయన ఆదేశించారు. ఉద్యోగులు ఉత్తమ సేవలు అందించేలా నిబంధనల మేరకు వారికి కావాల్సిన ప్రతి అవసరాన్ని తీరుస్తామని జాయింట్ కలెక్టర్ స్పష్టం చేశారు.
కార్యక్రమంలో సి.పి.ఓ. వెంకటేశ్వర్లు, జడ్పీ సి.ఈ.ఓ. జాలిరెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.


