చీరాలలో సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజి కళాశాల లో చిప్ డిజైనింగ్ పై వర్క్ షాపును విజయవంతముగా ముగిసినట్లు కళాశాల అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ ఆర్. వి. రమణమూర్తి తెలియజేశారు.
ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యునికేషన్ ఇంజినీరింగ్ విభాగము వారి సంయుక్త ఆధ్వర్యములో గత 15 రోజులుగా బి.టెక్ 2 వ సం. చదువుతున్న విద్యార్థులకు ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ వారి సహకారముతో చిప్ డిజైనింగ్ పై వర్క్ షాపును నిర్వహించినట్లు కళాశాల ప్రధాన అధ్యాపకులు డాక్టర్ ఎం. వేణుగోపాల రావు తెలిపారు. ఆధునిక ఎలక్ట్రానిక్స్ లో చిప్ డిజైనింగ్ ఎంతో ప్రాముఖ్యత వహిస్తుందని వివిధ పనులను, వేగతంగాను, ఖచ్చితంగాను నిర్వహించటానికి ఎలక్ట్రానిక్స్ పరికరాలను పనిచేయించటానికి సరియైన చిప్ డిజైనింగ్ ఎంతో ప్రాముఖ్యత వహిస్తుందని తెలిపారు. ఈ వర్క్ షాప్ లో చిప్ డిజైనింగ్ లోని ప్రాధమింకాంశాలు, చిప్ తయారిలోని వివిధ దశలు, చిప్ తయారు చేసేటపుడు ఏయే అంశాలను దృష్టిలో ఉంచుకోవాలి అనే అంశాలను విద్యార్థులకు అవగాహన కల్పించినట్లు ఇ.సి.ఇ విభాగాధిపతి డాక్టర్ కె. జగదీష్ బాబు తెలిపారు. చిప్ డిజైనింగ్ పై విద్యార్థులకు ఈ వర్క్ షాప్ లో ప్రాక్టికల్స్ నిర్వహించి చిప్స్ తయారు చేయించటం జరిగిందని తెలిపారు. ఈ వర్కషాపులో ఎ.పి.యస్.యస్.డి.సి సిహెచ్ గోపిరాజు, యం. ఉమా మహేశ్వర రావులు విద్యార్థులకు చిప్ డిజైనింగ్ పై అవగాహన కల్పించి వాటిని విద్యార్థులచే తయారు చేయించారు. ఈ కార్యక్రమమునకు యన్.వి. రాఘవ స్వామి, యస్. రవీంద్ర కన్వీనర్లుగా వ్యవహరించారు. కార్యక్రమములో వివిధ విభాగాధిపతులు అధ్యాపకులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నా



