జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా విఠలా పురంగ్రామానికి చెందిన కైపు వెంకటకృష్ణారెడ్డి (కేవీకే)ను నియమిస్తూ జిల్లాయువజన కాంగ్రెస్ అధ్యక్షులు శివార్జున్ శుక్రవారం నియామకపత్రం అందజేశారు. ఈ సందర్భంగా శివార్జున్ మాట్లాడుతూ …యువజన కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన వెంకట కృష్ణారెడ్డి మాట్లాడుతూ తనను ఈ పదవికి ఎంపిక చేసిన జాతీయ యువజన కాంగ్రెస్ కార్యదర్శి బీ రమేష్ బాబు, రాష్ట్ర అధ్యక్షులు లక్కురాజు రామా రావు, రాష్ట్రప్రధాన కార్యదర్శి దాసరి రవిలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
