ఆక్వా ఫీడ్, కెమికల్స్ దుకాణాదారులు తప్పనిసరిగా అనుమతులు తీసుకుని దుకాణాలు నడుపుకోవాలని జిల్లా ఫిషరీప్ జాయింట్ డైరెక్టర్ ఎ. చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. పట్టణంలోని పలు దుకాణాలను శనివారం ఎడీ ఉషా కిరణ్, డ్రగ్ ఇన్స్ఫెక్టర్ సత్యలతో కలసి అకస్మిక తనిఖీలు నిర్వహించారు. కర్నూల్ రోడ్ లో ఎపీ స్టైట్ ఆక్వా కల్చర్ డిపార్ట్మెంట్ అథారిటీ (ఎస్ఏడీఏ) అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న పలు దుకాణాలను కనుగొన్నారు. దీంతో వారు అమ్మతున్న ఉత్పుత్తలను, అనుమతి పత్రాలను క్షున్నంగా పరిశీలించారు. ప్రతి ఆక్వా దుకాణాదారులు తప్పనిసరిగా ఎస్ఏడీఏ అనుమతులు తీసుకోవాలని, లేదంటే కఠిన చర్యలు తప్పవని అన్నారు. కౌశిక్, ఆక్వా దుకాణాలను పరిశీలించి పూర్తి అనుమతి పత్రాలు లేని దుకాణదారులకు జరిమాన విధించినట్లు తెలిపారు. వారి వెంట ఎల్డీఓలు రవి, ఆశ, సిబ్బందిలు పాల్గొన్నారు.



