పోలీస్ దేశ సరిహద్దుల రక్షణతో పాటు అంతర్గత శాంతి భద్రతలను కాపాడుతున్న ఓ మహోన్నత శక్తి అని దేశం కోసం ప్రాణాలు అర్పించిన వారి త్యాగాలు అజరామం అని దర్శి సీఐ జె రామకోటయ్య పేర్కొన్నారు .దర్శి పట్టణంలో శనివారం పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా అమరులైన పోలీసులకు, జవాన్లకు నివాళులు అర్పిస్తూ వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ దర్శి సీఐ రామకోటయ్య ఆధ్వర్యంలో పోలీసులు, మహిళా పోలీసులు, పోలీసులతో, పౌరులతో కలసి గడియారం స్తంభం సెంటర్ నుండి ప్లేకార్డులు పట్టి పోలీసుల త్యాగాలను గుర్తు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. దర్శి సీఐ రామకోటయ్య మాట్లాడుతూ దేశంకోసం ప్రాణాలు అర్పించిన అమరులను గుర్తు చేసుకుంటూ పోలీసులు అమర వీరుల దినోత్సవం నిర్వహిస్తున్నామని చెప్పారు. అమరుల త్యాగాలు మరువలేనివని అన్నారు.. అమరులైన పోలీసులకు గడియారం స్తంభం వద్ద నివాళులు అర్పించారు. కార్యక్రమంలో దర్శి ఎస్సె రామక్రిష్ణ, ముండ్లమూరు ఎస్సై యూవీ క్రిష్ణయ్య తాళ్లూరు ఎస్సై వైవీ రమణయ్య, మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




