జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం గుంటి గంగా భవాని ఆలయంలో జై భీమ్ మాలల అన్నదాన సత్రం నిర్మాణం కొరకు ఎంపీ గ్రాండ్ ఇవ్వాలని జై భీమ్ మాలల అన్నదాన సత్రం కమిటీ బాధ్యులు గౌరవ అధ్యక్షుడు వేమ శ్రీనివాసరావు, సెక్రటరీ పులి వికాస్, కోశాధికారి దారా అంజయ్య, అంజయ్యలు శనివారం ఒంగోలులో ఎంపీ మాగుంటను కలసి విన్నవించారు. వినతి పత్రం సమర్పించారు. అందుకు ఎంపీ సానుకూలంగా స్పందించినందుకు కృతజ్ఞతలు తెలిపినట్లు సంఘ బాధ్యులు తెలిపారు.
