అరటిలో అన్ని కాలాలలో వచ్చే తెగుళ్ల నివారణకు యాజమాన్య పద్ధతులు పాటించడం ఉత్తమమైన మార్గమని మండల వ్యవసాయాధికారి బి. ప్రసాదరావు అన్నారు. క్షేత్ర పర్యటనలో భాగంగా శనివారం ఆయన తాళ్లూరు మండలంలోని శివరామపురం గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా అరటి తోటలను పరిశీలించి రైతులకు యాజమాన్య పద్ధతులపై తగిన సూచనలు, సలహాలు ఇచ్చారు. అరటిలో ముఖ్యంగా సిగటోకా ఆకు మచ్చ తెగులు వ్యాపిస్తుందని, అక్టోబర్, నవంబర్ నెలల్లో దీని తీవ్రత అధికంగా ఉంటుందని వీటి నివారణకు యాజమాన్య పద్ధతులు పాటించడం ఉత్తమమైన చర్య అని అన్నారు. తాళ్లూరు మండలంలో 30 ఎకరాల విస్తీర్ణంలో అరటి తోటలు సాగు చేస్తున్నారని వ్యవసాయ శాఖ ద్వారా సూచించిన సూచనలను పాటించి, యాజమాన్య పద్ధతులు పాటిస్తూ ఉన్నట్లయితే అధిక దిగుబడితో పాటు అధిక లాభాలు పొందవచ్చని ఆయన తెలిపారు. కార్యక్రమంలో గ్రామ వ్యవసాయ సహాయకులు రాజశేఖర్ రెడ్డి, గ్రామ రైతులు పాల్గొన్నారు.
