జిల్లాలో ప్రసిద్ధి చెందిన గుంటి గంగా భవాని అమ్మవారికి మంగవారం విశేష పూజలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు…పూజారులు విజయలక్ష్మి, ప్రకాశరావు ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. నాగంబొట్ల పాలెం సొసైటీ చైర్మన్ యాడిక యలమందా రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాజీ దేవస్థాన కమిటీ చైర్మన్ కటకంశెట్టి శ్రీనివాసరావు స్వాగతం పలికి సన్మానించారు. భక్తులకు కావాలసిన సౌకర్యాలను ఈఓ బాస్కర్ రెడ్డి, ఆలయ అధికారి శ్రీనివాసరావు పర్యవేక్షించారు. మాజీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు పూనూరి దేవదానం, రాము తదితరులు పాల్గొన్నారు.

