దర్శి పట్టణంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ , మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి ప్రత్యేక పూజలు నిర్వహణ – పలు సేవా కార్యక్రమాలు నిర్వహణ…

జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, దర్శి మాజీ ఎమ్మెల్యే డాక్టర్
బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిలు దసరా పండుగ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి వల సేవా కార్యక్రమాలు నిర్వహించారు. నగర
పంచాయతీకార్మికులకు దుస్తుల పంపిణీ
చేశారు. నూతనంగా నిర్మించి తమ గృహంలో పనులు పూర్తి చేసి విజయదశమి
రోజున కుటుంబ సమేతంగా గృహప్రవేశం చేశారు. అనంతరం శ్రీ వాసవీ
కన్యకాపరమేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలకు
హాజరయ్యారు.ఈసందర్భంగా ఆర్య వైశ్య సంఘనాయకులు వెంకాయమ్మ,
నందిని, శివప్రసాద్ రెడ్డి దంపతులను దుశ్శాలువాలు, పూలమాలలతో ఘనంగా
సత్కరించారు. అనంతరం బసిరెడ్డి పల్లె గ్రామానికి చెందిన కొప్పుల చిన్నవెంకటేశ్వర్లుకు జగనన్న సురక్ష కార్యక్రమంలో వెంకాయమ్మ ఇచ్చిన హామీ
మేరకు ఒంగోలు వైద్యులచే పరీక్షలు చేయించి రూ.12వేలు విలువ గల వినికిడి
యంత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వెంకాయమ్మ, డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి లుమాట్లాడుతూ… జిల్లా ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు
తెలియజేశారు. విజయదశమి సందర్భంగా పట్టణంలోని పారిశుధ్య కార్మికులకు
దుస్తులు ఇవ్వడం చాలా ఆనందంగా ఉందన్నారు. కార్మికులు చేస్తున్న సేవలను
కొనియాడారు.ఆయా కార్యక్రమాలలో షేక్ కార్పోరేషన్ డెరెక్టర్, వైయస్సార్ వైద్య విభాగ సంఘ అధికార ప్రతినిధి డాక్టర్ ఎస్.ఎం బాషా, మాజీ ఎంపీపీ ఇత్తడి దేవదానం, మాజీ సర్పంచి గురువారెడ్డి, మాజీ ఎన్ఎస్వి కెనాల్ చైర్మన్ సద్ది పుల్లారెడ్డి, శివారెడ్డి పలు మండలాల నాయకులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *