కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే మహిళలకు స్వేచ్ఛ, స్వాతంత్రాలు వస్తాయని యువజన కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి బిఆర్ గౌస్ అన్నారు. ఇందిరా గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని మంగళవారం జిల్లా యువజన కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ కైపు వెంకటకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శివార్జున్ అధ్యక్షతన చారిత్రాత్మక భారజోడో యాత్రను దర్శి పట్టణంలో నిర్వహించారు.ఈ సందర్భంగా స్థానిక ఆర్టీవో ఆఫీసు నుండి పట్టణంలోని అన్ని వీధులు తిరుగుతూ గడియార స్తంభం మీదుగా గంగవరం రోడ్డులోని ఇందిరా గాంధీ విగ్రహం వరకు భారత్ జోడు పాదయాత్ర చేసి ఇందిరా గాంధీకి ఘన నివాళులర్పించారు.ఈ సందర్భంగా యువజన కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి బి ఆర్ గౌస్ మాట్లాడుతూ …… భారతదేశంలో ఎన్నో విప్లవాత్మక మార్పులకు నాంది పలికిన ఉక్కు మహిళ ఇందిరా గాంధీ అన్ని వర్గాల వారికి బ్యాంకింగ్ సేవలను అందుబాటులో తేవాలనే సదుద్దేశంతో బ్యాంకుల జాతీయకరణ చేసిన వ్యక్తి ఇందిరా గాంధీ అని, ప్రతి పేదవాడికి గూడు కల్పించిన వ్యక్తి ఇందిరా గాంధీ అని అన్నారు . కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాసరి రవి , మాజీ కార్యదర్శి కనిగిరి సమన్వయ కమిటీ సభ్యులు వేల్పుల రాజశేఖర్, కురిచేడు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాటం వెంకటరమణారెడ్డి, అచ్యుత్ కుమార్, SN పాడు నియోజకవర్గ అధ్యక్షులు గుత్తి రాజు, సుదర్శన్ రెడ్డి, ప్రతాప్, శేఖర్, మహేష్ దర్శి నియోజకవర్గ యువకులు భారీ ఎత్తున పాల్గొన్నారు. జిల్లా యువజన కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ కైపు వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ, ….. దర్శి లో అర్ధాంతరంగా ఆగిపోయిన ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్ కి నిధులు కేటాయించి త్వరగా పూర్తి చేయాలని మరియు దొనకొండలో పారిశ్రామిక కేడర్ ని ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతీ యువకులకు యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని డీఎస్సీ విడుదల చేయాలని ఆయన అన్నారు.
