తాళ్లూరు మండలంలోని బొద్దికురపాడు గ్రామంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వేర్ హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ మూలం రెడ్డి అంజలి తండ్రి ఎర్రబెల్లి లక్ష్మీరెడ్డి పెద్దకర్మ కార్యక్రమంలో మద్దిశెట్టి రవీంద్ర లక్ష్మిరెడ్డి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. వీరితోపాటు జెడ్పీటీసీ మారం వెంకటరెడ్డి, వైస్ ఎంపీపీ మంచాల ప్రియాంక నాగార్జున రెడ్డి, నాగం బొట్లపాలెం సొసైటీ అధ్యక్షులు యాడిక యలమందా రెడ్డి, జిల్లా నాయ కులు మూలంరెడ్డి ప్రసాద్ రెడ్డి, రాజానగరం సర్పంచ్ వలి, కౌన్సిలర్ వీసిరెడ్డి , గంగిరెడ్డిపాలెం ఎలమందరెడ్డి, కో ఆప్షన్ నెంబర్ కరిముల్లా ఎంపీటీసీ జిఎస్ ప్రభాకర్ రెడ్డి , మాజీ సొసైటీ అధ్యక్షుడు ఎస్. శ్రీనివాస్ రెడ్డి, తాళ్లూరు మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షులు మారం ఇంద్రసేనారెడ్డి, సీనియర్ నాయకులు పులి బ్రహ్మరెడ్డి, మండలం లోని నాయకులు, గ్రామ నాయకులు పాల్గొన్నారు.

