ఎన్నిక లను ప్రశాంతంగా నిర్వహించే కార్యక్రమంలో భాగంగా మండలం లోని పలుగ్రామాల్లో స్పెషల్ పార్టీ పోలీసులు ఆదివారం కవాతు ని ర్వహించారు. దర్శి డీఎస్పీ అశోక్ వర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో మండలం లోని సోమవరప్పాడు, దారంవారి పాలెం, శివరాంపురం, లక్క వరం, బొద్దికూరపాడు, దోసకాయలపాడు, బెల్లంకొండవారిపాలెం, కొర్ర పాటివారిపాలెం, తూర్పుగంగవరం, తాళ్లూరు గ్రామాల్లో కవాతు చేశారు. కార్యక్రమంలో ఏఎస్సై మోహన్ రావు, పాల్గొన్నారు.


