ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ ఇంటింటా ప్రచారం చేస్తున్నారు. తాళ్లూరు మండలంలోని తూర్పుగంగవరంలో ఆదివారం దర్శి వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్రసాదరెడ్డి సతీమణి నం దీనితో కలిసి ఆమె ఇంటింటా ప్రచారం చేశారు. బూచేపల్లి వెంకాయమ్మ ఓటర్లను నేరుగా కలిసి తన బిడ్డ శివప్రసాదరెడ్డి ప్రజాసేవకు పరితపిస్తు న్నారని పేర్కొన్నారు. ప్రజాసేవే పరమావధిగా ముందుకు సాగుతున్న శివప్రసాదరెడ్డికి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. బూచేపల్లి నందిని మండుటెండలో సైతం
నాయకులు, మహిళలు, అభిమానులతో కలిసి గ్రామ ప్రధాన వీధుల్లో ప్రచారం చేశారు. ఇస్త్రీ చేసి రజకుల కష్ట సుఖాలు తెలుసుకున్నారు. తాళ్లూరు మండల ఇన్చార్జ్లు మస్తాన్ రెడ్డి, నరసింహారెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు తూము వెంకట సుబ్బారెడ్డి, జేసీ ఎస్ మండల కన్వీనర్ యాడిక శ్రీనివాసరెడ్డి, మాజీ ఎంపీపీ పోశం మధుసూదన్ రెడ్డి, గుం టిగంగ ఆలయ మాజీ చైర్మన్ కటకంశెట్టి శ్రీని వాసరావు, సొసైటీ చైర్మన్ యాడిక యలమం దారెడ్డి, మాజీ ఏఎంసీ డైరెక్టర్ గుజ్జుల యోగిరెడ్డి, కృష్ణా రెడ్డి, పి.దేవదానం, భీమిరెడ్డి నాగమల్లేశ్వరరెడ్డి, జక్కుల రామకృష్ణ, సయ్యద్ లతీఫ్ తదితరులు పాల్గొన్నారు.





