మార్కాపురం టిడిపి అభ్యర్థి కందుల నారాయణ రెడ్డి శుక్రవారం పొదిలిలో జరిగిన ప్రజా గళం ఎన్నికల ప్రచార సభలో ప్రజలను ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసే విధంగా మాట్లాడారు. ఈ ఎన్నికలలో దయచేసి ఈ నియోజక వర్గంలో తెలుగుదేశం పార్టీని గెలిపిస్తారో లేదంటే నాతల తీసేస్తారో మీమీదకే వదిలేస్తున్నాన్నంటూ ఎమోషనల్ బ్లాక్ మెయిల్ ప్రసంగం చేయటం విమర్శలకు తావిస్తుంది. ఇటీవల టిటిపి పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు మార్కాపురం పర్యటనకు వచ్చిన సందర్భంలో కూడ తనను గెలిపించక పోతే తన శవం చూస్తారంటూ ఒక్కసారి, గెలిపించక పోతే ఉరేసుకుంటానని మరో సారి చేసిన ఎన్నికల ప్రసంగంపై వైఎస్సార్సీపీ నాయకులు ఎన్నికల సంఘానికి ఆర్.ఓకి ఫిర్యాదు చేసేందుకు సిద్ధం అయ్యారు. ఓడిపోతామనే భయంతోనే ఇలా ప్రతి సభలో కందుల నారాయణ రెడ్డి ప్రజలను ఆందోళన, భయబ్రాంతులకు గురిచేసే విధంగా సెంటిమెంట్ను ఉపయోగిస్తూ మాట్లాడటాన్ని స్వంత పార్టీ వారే విమర్శిస్తున్నారు.
మరోసారి కందుల ఎమోషనల్ బ్లాక్ మెయిల్ ప్రకటన
03
May