వేగం కన్నా ప్రాణాలు మిన్న ఆన్న విషయాన్ని ప్రతి వాహన దారుడు గుర్తించాలని,నార్త్ జోన్ ట్రాఫిక్ ఏ.సి.పీ జీ.శంకర్ రాజు అన్నారు.శుక్రవారం బేగంపేట లో సత్యం వెంచర్ ఇంజనీరింగ్ సర్వీసెస్ ప్రైవేటు లిమిటెడ్ సిబ్బందికి రోడ్ భద్రత ట్రాఫిక్ అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏ సి పి శంకర్ రాజు మాట్లాడుతూ 18సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్స్ పొందాలన్నారు.లైసెన్స్ పొందిన తరువాతనే వాహనాలు నడపాలన్నారు.యువత అతి వేగం తో ప్రయాణిస్తూ వారి ప్రాణాల్ని కోల్పోతున్నారని అన్నారు.రాంగ్ రూట్లో ప్రయానించవద్దని, త్రిబుల్ రైడింగ్ చేయవద్దని,సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయవద్దని ఆయన వారికి సూచించారు.అలాగే జీబ్రా క్రాసింగ్ వద్ద పాద చారులు రోడ్డు దాటుతున్న సమయం లో వాహనాలను నిలపాలన్నారు . ఈ సందర్భంగా వారికి ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ నియంత్రణ ఎలా చేస్తారు. రోడ్డు పైన సూచికలను ఎలా గుర్తించాలి అనే విషయాలను వారికి వివరించారు.అలాగే ప్రతి వాహన దారుడు తమ వాహనాలకు సంబంధించిన ఫిట్నెస్ సర్టిఫికేట్,ఇన్స్యూరెన్స్,పొల్యూషన్ సర్టిఫికేట్ లను తప్పకుండా కలిగి వుండాలని ఏ సి.పీ వారికి సూచించారు.ఈ అవగాహనా కార్యక్రమంలో సత్యం వెంచర్ ఇంజనీరింగ్ సర్వీసెస్ ప్రైవేటు లిమిటెడ్ సీ ఈ ఓ ఎమ్ ఆర్ రావు,శ్రీనివాస్ వడ్లమూడి, వైస్ ప్రెసిడెంట్ సురేష్,హీరో మోటార్ కాప్ శ్రావణ్,వెంకట ప్రసాద్ సిబ్బంది.పాల్గొన్నారు.


