కాంగ్రెస్,బీ జే పీ లకు ఓట్లేస్తే ప్రజలకు ఒరిగేది ఏమీలేదు….పద్మారావు గౌడ్,తలసాని.

కాంగ్రెస్, బీ జే పీ పార్టీల కు ఓట్లేస్తే ప్రజలకు ఒరిగేదేమీ లేదని సికింద్రాబాద్ పార్లమెంట్ బీ ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి,పద్మారావు గౌడ్ మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ లు అన్నారు. ఆదివారం సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని రాంగోపాల్ పేట డివిజన్ లో వారు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మినిస్టర్ రోడ్డులోని సాయిబాబా ఆలయం నుండి ప్రచారాన్ని ప్రారంభించి కాచి బౌలి, వెంగళ్ రావు నగర్, సి లైన్, ఎఫ్ లైన్, గైదన్ బాగ్, నల్లగుట్ట, నల్లగుట్ట మసీద్ తదితర ప్రాంతాలలో ఇంటింటికి వెళ్ళి ప్రచారం నిర్వహించారు. ముందుగా వారికి స్థానిక నాయకులు కల్లు గీసేందుకు ఉపయోగించే కల్లు లొట్టి, మోకు, ముస్తాక్ లను అందజేశారు. ప్రచారంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అడుగడుగునా మంగళహారతులు, పూలమాలలు, శాలువాలతో మహిళలు, పార్టీ నాయకులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ప్రజలు అభివృద్ధి, సంక్షేమాన్ని కోరుకుంటున్నారని, అసెంబ్లీ ఎన్నికలలో అన్ని స్థానాలలో బీ ఆర్ ఎస్ పార్టీని గెలిపించి రుజువు చేశారని, పార్లమెంట్ ఎన్నికలలో కూడా అవే ఫలితాలు పునరావృతం అవుతాయని స్పష్టం చేశారు. అన్ని వర్గాల ప్రజలు ప్రచారంలో తమకు ఎంతో ఘన స్వాగతం పలుకుతూ తమ అభిమానాన్ని చాటుతూ మద్దతును తెలుపుతున్నారని, భారీ మెజార్టీ తో సికింద్రాబాద్ లో బీ ఆర్ ఎస్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మాయమాటల, దొంగ హామీల కాంగ్రెస్, బీ జే పి పార్టీలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. ఓట్లేసి ఎం పి గా గెలిపిస్తే కేంద్రమంత్రి హోదాను పొందిన కిషన్ రెడ్డి సికింద్రాబాద్ నియోజకవర్గ ప్రజలకు ఏం మేలు చేశారని, ఎందుకు ఓటేయాలని ప్రశ్నించారు. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒక్క నియోజకవర్గంలో నైనా చెప్పుకో దగిన అభివృద్ధి పనులు ఏమైనా కేంద్రమంత్రిగా కిషన్ రెడ్డి చేశారా? అనే విషయాన్ని ప్రజలు కూడా గుర్తించాలని అన్నారు. కనీసం సమస్యలు చెప్పుకోవడానికి కూడా అందుబాటులో ఉండేవారు కాదని, అలాంటి వ్యక్తికీ తిరిగి మరోసారి ఓట్లు వేసేందుకు ప్రజలు సుముఖంగా లేరన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఆచరణ సాధ్యం కాని దొంగ హామీలతో అధికారంలోకి వచ్చి హామీల అమలును మరిచిందని, ప్రజలను మోసగించిందని ధ్వజమెత్తారు. 5 నెలల్లోనే కాంగ్రెస్ పార్టీ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని, తమను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికలలో ప్రజలు తగిన బుద్ది చెప్పడానికి సిద్దంగా ఉన్నారని వారు తెలిపారు. ప్రచార కార్యక్రమంలో బేగంపేట కార్పొరేటర్ టి.మహేశ్వరి, మాజీ కార్పొరేటర్ లు అత్తిలి మల్లిఖార్జున్ గౌడ్, కిరణ్మయి, డివిజన్ బీ ఆర్ ఎస్ అద్యక్షులు అత్తిలి శ్రీనివాస్ గౌడ్, నాయకులు కిషోర్, ఆంజనేయులు, గణేష్, సతీష్, సత్యనారాయణ, కోటేశ్వర్ గౌడ్, జనార్ధన్, నర్సింగ్ రావు, రహీం, యాసిన్, ఆలీషా, అనీఫ్, లావణ్య, పుష్ప, ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

అన్ని వర్గాల ప్రజల మద్దతు బీ ఆర్ ఎస్ పార్టీ కే

సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని అన్ని వర్గాల ప్రజలు బీ ఆర్ ఎస్ పార్టీకి తమ సంపూర్ణ మద్దతును తెలియజేస్తున్నారని సికింద్రాబాద్ పార్లమెంట్ బీ ఆర్ ఎస్ అభ్యర్ధి పద్మారావు గౌడ్, మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ లు అన్నారు. ఆదివారం పద్మారావు నగర్ లో బీ ఆర్ ఎస్ పార్టీ కార్యాలయాన్ని వారు ప్రారంభించారు. ముందుగా స్థానిక అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఎక్కడికి వెళ్ళినా ప్రచారంలో ప్రజలు ఘన స్వాగతం పలుకుతూ తమ ప్రేమాభిమానాలను చాటుతున్నారని తెలిపారు. తన గెలుపుకోసం తీవ్రమైన ఎండలను సైతం లెక్క చేయకుండా ఇంటింటికి తిరుగుతూ విస్తృత ప్రచారం నిర్వహిస్తున్న కార్పొరేటర్ లు, మాజీ కార్పొరేటర్ లు, డివిజన్ అద్యక్షులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో బన్సీలాల్ పేట కార్పొరేటర్ కుర్మ హేమలత లక్ష్మీపతి, డివిజన్ బీ ఆర్ ఎస్ అద్యక్షులు వెంకటేషన్ రాజు, పద్మారావు నగర్ ఇంచార్జి గుర్రం పవన్ కుమార్ గౌడ్, నాయకులు ఏసూరి మహేష్, శ్రీకాంత్ రెడ్డి, పుష్యంత్ రెడ్డి, రమణ, ముక్కా శ్రీనివాస్, అమృత, అనిత, కౌసల్య, దుర్గ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *