- అతి పిన్న సమాజసేవకురాలిగా గుర్తింపు
దాతృత్వం, సేవాభావంతో ఇప్పటికే పలువురు ప్రముఖుల ప్రశంసలు, అనేక అవార్డులు అందుకున్న హైదరాబాద్ చిన్నారి కలశను విశిష్ట అవార్డు వరించింది. కలశ ఫౌండేషన్ ద్వారా ఆమె అందిస్తున్న సేవలు ఇప్పటికే ఖండాంతరాలు దాటాయి. ఎన్నో దేశాల అవార్డులు, రివార్డులు వరించాయి. తాజాగా, యునైటెడ్ నేషన్స్ గ్లోబల్ పీస్ కౌన్సిల్ ఇటీవల ఆమెను గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది. చిన్నారి కలశ పలుదేశాల్లో అందించిన సేవాకార్యక్రమాలకు గుర్తింపుగా లండన్ పార్లమెంటు భవనంలో ‘ప్రపంచంలో అతి పిన్న వయస్కురాలైన సమాజ సేవకురాలు’ గుర్తింపుతో పాటు గౌరవ డాక్టరేట్‌ను అందుకున్నట్లు కలశ ఫౌండేషన్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది.
