పవిత్ర పుణ్య క్షేత్రమైన గుంటిగంగాభవానీ అ మ్మవారి కృపకు భక్తులను మరింత చేరువ చేసేందుకు దేవదాయ శాఖ ఆధర్యంలో ప్రత్యేక పూజాకార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో పి.కార్తిక్, ఆలయ క మిటీ చైర్మన్ కొసనా గురుబ్రహ్మం మంగళవారం తెలిపారు. అమ్మవారికి ప్రతి మంగళవారం, శుక్రవా రం వేకువ జాముల్లో అభిషేకాలు, సుబ్రభాత సేవ, కుంకుమార్చన వంటి పూజా కార్యక్రమాలు చేప ట్టేందుకు దేవదాయశాఖ నిర్ణ యించినట్లు తెలిపారు. అమ్మవారి కి విరాళాలు అందజేసిన దాతలు, భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొనాలన్నారు. బుధవారం మంచి రోజయినందున గంగాభవాని ఆలయంలో ప్రత్యేక పూజలు ప్రారంభమవుతాయన్నారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసు కోవాలని కోరారు.
