జిల్లాలోని పలు ప్రాంతాల్లో మంగళవారం భారీ వర్షం కురిసింది. సాయం త్రానికి వాతావరణం ఒక్కసారిగా మేఘావృతమై చల్లని గాలులు వీచాయి. ఉరుములు, మెరుపులతో వర్షం పడింది. మార్కాపురం,పొదిలి, గిద్దలూరు, కొండపి, కనిగిరి, యర్రగొం డపాలెం, సంతనూతలపాడు, ఒంగోలు నియోజకవర్గాల్లో ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. తాళ్లూరు మండలంలో ఓ మోస్తరు వర్షం కురిసింది. ఒంగోలు నగరంలో గం టపాటు — కుండపోత వాన– కురిసింది.– ఈదురుగాలులతో పలుచోట్ల నేలకొరిగాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది.

