మల్కాజ్ గిరీ పార్లమెంట్ నియోజక వర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనకు హస్తం గుర్తు పైన ఓట్లేసి గెలీ పించాలని,అభివృద్ధి చేసి చూపుతానని పట్నం సునీతా మహేందర్ రెడ్డి ఓటర్లను కోరారు.బుధవారం మల్కాజ్ గిరీ పార్లమెంట్ కూకట్ పల్లి నియోజక వర్గం బేగంపేట డివిజన్ పరిధిలోని తాతా చారి కాలనీ.శ్యామ్ లాల్ బిల్డింగ్,ప్రకాశం నగర్.అల్లం తోట బాయి లలో ఆమె మాజీ కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ తో కల్సి ఇంటింటి ఎన్నికల ప్రచారం తో పాటు రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పేదలకు మేలు చేసే పార్టీ అన్నారు.ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారంటేలను అమలు చేస్తుందన్నారు. ఈ పార్లమెంట్ ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీ నీ గెలిపించాలని కోరారు.ప్రతి ఒక్కరూ హస్తం గుర్తు పైన ఓట్లేసి తనను గెలిపించాలని కోరారు.మాజీ కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ మాట్లాడుతూ మల్కాజ్ గిరీ పార్లమెంట్ నియోజక వర్గం పరిధి లోని ఓటర్లు ఎంతో పరిణితి కలిగిన వారన్నారు.తనను మల్కాజ్ గిరి పార్లమెంట్ నుంచి గతం లో గెలిపించడంతో కేంద్రమంత్రిగా తనకు అవకాశం దక్కిందన్నారు. ఈ ఎన్నికల్లో సునీతా మహేందర్ రెడ్డి నీ భారీ మెజార్టీ తో గెలిపించాలని కోరారు.సనత్ నగర్ నియోజక వర్గం బేగంపేట కంటెస్టెడ్ కార్పొరేటర్ , ఏ బ్లాక్ బీ బ్లాక్ మాజీ అధ్యక్షులు షేక్ గౌస్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ హయాంలో నే అభివృద్ధి జరిగిందన్నారు. ఈ ఎన్నికలలో పట్నం సునీతా మహేందర్ రెడ్డి నీ గెలిపించాలన్నారు.బేగంపేట కంటేస్టడ్ కార్పొరేటర్ మాజీ ఏ బ్లాక్ బీ బ్లాక్ మాజీ అధ్యక్షులు షేక్ గౌస్ ,నాగిరెడ్డి, సీనియర్ నాయకులు హోసీ టోచేర్,విశాల్ సూద్దం,మహమ్మద్ అసలాం,రామగల్ల రమాదేవి ,నరసింగరావు,తదితరులు పాల్గొన్నారు.



